BREAKING
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

9వ డివిజన్ సిపిఐ పార్టీ అభ్యర్థి చిన్నం పెంచలయ్య ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
9వ డివిజన్ సిపిఐ పార్టీ అభ్యర్థి చిన్నం పెంచలయ్య ఎన్నికల ప్రచారం

తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్ 9వ డివిజన్ అభివృద్ధికి కంకి కొడవలి గుర్తుకు ఓటేయండి: సీపీఐ అభ్యర్థి చిన్నం పెంచలయ్య

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 9వ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థి చిన్నం పెంచలయ్యను కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ లెనిన్ నగర్, పార్వతీపురం ప్రాంతాల్లో సీపీఐ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, డివిజన్ అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.

ప్రజల సమస్యలను పరిష్కరించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించడం తమ ప్రధాన లక్ష్యమని నాయకులు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే కమ్యూనిస్టు అభ్యర్థి చిన్నం పెంచలయ్యను కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని లెనిన్ నగర్, పార్వతీపురం ప్రాంతాల ప్రజలను సీపీఐ నాయకులు, కార్యకర్తలు కోరారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి