BREAKING
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

50వ డివిజన్‌లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆత్మీయ సమావేశం

Select Suryaa Now
50వ డివిజన్‌లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆత్మీయ సమావేశం

నెల్లూరు, మేజర్ న్యూస్ :    నగరంలోని 50వ డివిజన్ అంబేద్కర్ నగర్‌లో నెల్లూరు రూరల్ తెలుగుయువత అధ్యక్షుడు నందిపాటి శ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.  నెల్లూరు నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపునకు కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు.  రాబోయే ఎన్నికల్లో నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్‌తో పాటు, 50వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి నందిపాటి శైలజను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.