BREAKING
పరాగ్వే నూతన అధ్యక్షుడిగా పెడ్రో అలియానా ప్రమాణ స్వీకారం నిఖిల్ 'స్వయంభు' సినిమా విడుదలపై తీవ్ర అనిశ్చితి: పాన్ ఇండియా చిత్రాల వలసల వల్ల హీరోలకు తప్పని కష్టాలు అయ్యప్ప అన్నసమారాధనలో పాల్గొన్న స్వాతి ప్రమోటర్స్ ఎండి రమేష్ రెడ్డి నేరడిగొండ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘనంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ దినోత్సవం సిద్దిపేట డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి - టీఎంయూ రాష్ట్ర నాయకుల డిమాండ్ ఆళ్లగడ్డ మండలంలో కూటమి ప్రభంజనం ఐవీవై పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు కీర్తి సురేష్, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నెట్‌ఫ్లిక్స్ 'అక్క' వెబ్ సిరీస్: మాతృస్వామ్య నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వచ్చునూరు గ్రామ మాజీ సర్పంచ్ పారమిత విద్యాసంస్థలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు వ్యూహం ఫలించింది...ఆశించిన ఎంపీపీ పీఠం దక్కింది! పాలమూరు ఎడారిగా మారడానికి కేసీఆరే కారణం సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ముగింపు సందర్భంగా ర్యాలీ నేరేడుచర్లలో బియ్యం ధరల బాదుడు! కరువు కష్టాలకు తోడు వ్యాపారుల ధరల మోత.. సామాన్యుడి బతుకు భారమే! కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలు అధికారుల హెచ్చరికలు ప్రకటనలకేనా? క్షేత్రస్థాయిలో తనిఖీలేవీ అచీవర్స్ పాఠశాలలో ఘనంగా కాలుష్య రహిత దీపావళి వేడుకలు

32వ డివిజన్‌లో విస్తృతంగా పారిశుద్ధ్య పనులు..పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ కౌసర్, జనసేన నాయకుడు ఇమామ్ హుస్సేన్

Select Suryaa Now
32వ డివిజన్‌లో విస్తృతంగా పారిశుద్ధ్య పనులు..పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ కౌసర్, జనసేన నాయకుడు ఇమామ్ హుస్సేన్

 అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్:-
అనంతపురం నగరంలోని 32వ డివిజన్‌లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా శుభ్రత పనులు నిర్వహించారు. వీధులు, కాలువలు, పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ పనులను 32వ డివిజన్ కార్పొరేటర్ కౌసర్, జనసేన నాయకుడు ఇమామ్ హుస్సేన్ స్వయంగా పర్యవేక్షించారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలు కూడా సహకరించాలని వారు కోరారు. ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా డివిజన్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..