BREAKING
డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం

20 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..:ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు..

Select Suryaa Now
20 కోట్లతో  రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..:ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు..

అమలాపురం మేజర్ న్యూస్ ​గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు చేయలేని చారిత్రాత్మక అభివృద్ధిని చేసి చూపిస్తున్నమని ఎమ్మెల్యే ఆనందరావుఅన్నారు పట్టణ రూపురేఖలను శాశ్వతంగా మార్చివేసేలా, ఆధునిక సదుపాయాలతో కూడిన భారీ మౌలిక వసతుల కల్పనకు అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ప్రాజెక్టు కింద రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సెంట్రల్ డివైడర్,  ఆధునిక విద్యుత్ దీపాలతో కూడిన సుందరమైన రోడ్డు విస్తరణ పనులకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్యే ఆనందరావు ఆదివారం భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.
​ఈ ప్రాజెక్టులో భాగంగా అమలాపురం పట్టణ పరిధిలోని సత్యనారాయణ గార్డెన్స్ నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు,  హై స్కూల్ సెంటర్ నుండి కాలేజీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ డివైడర్‌తో కూడిన రోడ్డు పనులను చేపట్టనున్నారు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ గతంలో అమలాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మంత్రులుగానీ, ఎమ్మెల్యేలుగానీ పట్టణ సుందరీకరణపై, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై కనీస దృష్టి సారించలేదు. వారు చేయలేని చారిత్రాత్మక అభివృద్ధిని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే మేము చేసి చూపిస్తున్నాం. పట్టణ ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ రూ. 20 కోట్లతో ఎహ్ ఎ ఎం ప్రాజెక్టు ద్వారా డివైడర్లతో కూడిన రహదారుల విస్తరణతో నిర్మిస్తున్నాం" అని స్పష్టం చేశారు.
​అమలాపురం పట్టణ సమగ్ర వికాసానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి పొంగూరు నారాయణకు ఎమ్మెల్యే ఆనందరావు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వ దూరదృష్టి, మున్సిపల్ మంత్రి వేగవంతమైన నిర్ణయాల వల్లే ఇంతటి భారీ నిధులు అమలాపురానికి సాధ్యమయ్యాయని కొనియాడారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పనులను శరవేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
​ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.