162 మందికి రూ.64 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
వాసవి పెనుగొండ, సూర్య న్యూస్: ఆచంట నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మంజూరైన రూ.64,00,614/- విలువైన చెక్కులను 162 మంది బాధితులకు మాజీ మంత్రి, ఆచంట శాసనసభ్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారు పంపిణీ చేశారు. పోడూరు మండలం కొమ్ముచిక్కాల కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో తోడ్పాటునందిస్తోంది. ఈ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో ఉపయోగపడనుంది.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమికి చెందిన మండల, గ్రామ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : పి.వెంకట్రామయ్య, పెనుగొండ , పశ్చిమ గోదావరి జిల్లా