|
|
by Suryaa Desk | Mon, May 19, 2025, 03:50 PM
కొలంబియాలోని కుకుటా నగరంలో లా రివియేరా ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఘోర సంఘటన జరిగిందీ. డెలివరీ బాయ్ వేషంలో వచ్చిన వ్యక్తి 22 ఏళ్ల మరియా జోస్ ఎస్తుపినాన్ సాంచెజ్‌పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. దుండగుడు కాల్పులు జరిపిన వెంటనే సాంచెజ్ సహాయం కోసం గట్టిగా కేకలు వేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కాల్పులు జరిపిన తర్వాత సాంచెజ్ ఇంటి నుంచి నిందితుడు వేగంగా పారిపోతున్నట్టు ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ‘ఒక వ్యక్తి ప్యాకేజీ డెలివరీ చేస్తున్నట్టు నమ్మించి ఆమెను హత్య చేశాడు’ అని పోలీసులు తెలిపారు.