విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలి
పెద్దశంకరంపేట ; విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని ఎంఈఓ శేఖర్ అన్నారు. బుధవారం స్థానిక పీఎంశ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మండల స్థాయి వ్యాసరచన పోటీలను నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎలక్ట్రోరరోల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటింగ్ పోటీలో పాల్గొన్నారుI విద్యార్థులు కష్టపడితేనే బంగారుభవిష్యత్తు ఉంటుందని, చదువుతో పాటు ఇతర పోటీలలో ప్రతిభ కనబర్చాలని ఎంఈఓ సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం.శోభారాణి, ఉపాధ్యాయులు సిద్దిరాములు తదితరులున్నారు.