BREAKING
ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు అంతర్జాతీయ స్థాయి క్రీడల లక్ష్యంగా.... ఎస్వీయూలో 14న జాబ్ మేళా ఎస్ఎస్సి 2026-27 పరీక్ష ఫీజు గడువు తేదీలు విడుదల పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ మార్చి 2027 లో జరగనున్న ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ విడుదల చేసినట్లు పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి శ్రీ ఎండీ ఖాసీం ఒక ప్రకటనలో తెలియజేశారు. మండలంలోని అన్ని య సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా తెలుగులో సినిమా ఏసిపి సదానందం ఆధ్వర్యంలో శ్రీరాములపల్లి గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు నిర్లక్ష్యం , అతివేగం , ప్రమాదానికి కారణం మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు గెజిటెడ్ అధికారులు నియామకం.

ఎస్పీడబ్ల్యూలో బ్రేక్ ది సైలెన్స్ కార్యక్రమం

Select Suryaa Now
ఎస్పీడబ్ల్యూలో బ్రేక్ ది సైలెన్స్ కార్యక్రమం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో బ్రేక్ ది సైలెన్స్ కాల్ 1972 అనే అంశంపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మై భారత్, ఈగల్ టీమ్, రాజనీతి శాస్త్రం విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ భీమన్న అధ్యక్షత వహించి, మాట్లాడుతూ నేడు యువత చెడు వ్యసనాలకు లోనవుతున్నారని, సన్మార్గంలో పయనించాలంటే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఆవశ్యకమని తెలిపారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో మాదకద్రవ్యాల వినియోగం ప్రధానమైనదని, వాటికి యువత బానిసలు అవుతున్నారని చెప్పారు. విద్యార్థులు పట్టుదలతో చదువుకొని జ్ఞానాన్ని సంపాదిస్తే అది మంచి వైపు నడిపిస్తుందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని శక్తియాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించే రక్షణ కవచం అన్నారు. అనంతరం ఈగల్ టీమ్ సభ్యులు గోవింద్ మాట్లాడుతూ గంజాయిని వినియోగిస్తున్నట్లు అనుమానం కలిగినా, వారి వద్ద ఉన్నట్లు తెలిసినా వెంటనే 1972 నెంబర్ కి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గిరిజ, షీటీమ్ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్