వెంగళరావునగర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హాజరు
వెంగళరావునగర్, మేజర్ న్యూస్: వెంగళరావునగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ యూత్ ఆధ్వర్యంలో ఓల్డ్ వాటర్ ట్యాంక్ హనుమాన్ గ్రౌండ్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిరెడ్డి నాగార్జున రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాలనీకి చెందిన మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు, ఆటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకొన్నారు.
కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు చిలకల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి డి. ధనంజయరెడ్డి, సునీత, అజయ్, శివకుమార్, రాజశేఖర్, పి.హెచ్.ఎన్. ప్రసాద్, భాస్కర్, పూదోట శౌరిరాజు, శ్రీనివాస్, అర్జున్, తిరుమలేష్, ముత్తయ్య, సోమా తదితరులు పాల్గొన్నారు. కాలనీ యూత్ సభ్యులు వినయ్‌కుమార్, శరత్, సతీష్, చంటి, గౌస్, రవికిరణ్, కార్తీక్, రఘు, హేమంత్, స్వరూప్ తదితరులు ఏర్పాట్లలో పాలుపంచుకున్నారు. వేడుకలను విజయవంతం చేసిన వారందరికీ అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.