BREAKING
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు గొంతు ఎండుతుంది - త్రాగు నీరు ఇవ్వండి! గజపతినగరంలో రోగులు బాధలు సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ కురువ భాస్కర్ పరామర్శించిన జిల్లా అధ్యక్షులు అనంత, మేయర్ రమేష్ గౌడ్ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరిన కృష్ణాపురం గ్రామ దంపతులు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు హేమశ్రీ ఎంపిక వైసీపీకి 30వ వార్డు అభ్యర్థి దంపతుల రాజీనామా అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ పంకజ్ కుమార్ మీనా స్థానిక పోరులో అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే స్థానిక సమరానికి ఫలితాల వేళ! విద్యార్థులకు ఉపన్యాస పోటీలు ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కి సర్వసిద్ధం ఉద్యాన రైతులకు రూ.11.79 కోట్ల నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలి * సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు వినతి కల్వకోల్‌లో బీఆర్ఎస్ నేతల అసంతృప్తి సెగలు*

వేగవంతంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి

Select Suryaa Now
వేగవంతంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి

సూర్య,భీమ్‌గల్ : భీమ్‌గల్ మండలం మెండోరా గ్రామంలో నూతనంగా మంజూరైన ఐదు ఇందిరమ్మ ఇళ్లకు ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ గురువారం భూమిపూజ నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడతలో గ్రామానికి మంజూరైన 43 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడం పట్ల గ్రామ ప్రజాప్రతినిధులను అభినందించారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఒక వరమని, సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. నూతనంగా ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.