BREAKING
ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం శ్రీహరిపురంలో పల్లె నిద్ర కార్యక్రమం నవంబర్ 14 నుండి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతం చేయండి గ్రంథాలయ వారోత్సవాలకు అధికారులకు ఆహ్వానం మండల పరిషత్ పీఠంపై"మరడాన"ముద్ర.. సంక్రాంతి బరిలో సందడికి సిద్ధం.. రెండు నెలల ముందే ప్రమోషన్స్ షురూ చేసిన అనిల్ రావిపూడి ఆటపాటలతో కూడిన బోధనపై అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ...ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనకదుర్గ. పరిషత్ పోరులో కీలక ఘట్టం.. ఎంపీపీ ఎన్నికకు వేళాయే లాయర్‌గా కీర్తి సురేశ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్.. సత్యవాన్ సావిత్రి ట్రైలర్ విడుదల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు మన్యం సవారి లో ఎన్ జి ఓ నాయుకులు గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి ఎంతవరకు మేలు చేస్తుంది? వైద్యులు చెబుతున్న అసలు నిజాలు ఇవే మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మృతి టీడీపీకి, రాజకీయ రంగానికి తీరని లోటు చేయి తడిపితే చాలు.. చెక్ పోస్టు దాటెయ్యడమే!!!

వైశ్యులంతా ఐక్యంగా ఉండాలి - జిల్లా సంఘం మాజీ అధ్యక్షులు వంగపల్లి నాగభూషణం గుప్త..

Select Suryaa Now
వైశ్యులంతా ఐక్యంగా ఉండాలి - జిల్లా సంఘం మాజీ అధ్యక్షులు వంగపల్లి నాగభూషణం గుప్త..
సూర్యఎల్లారెడ్డి : వైశ్యులంతా ఏకతాటిపై ఉంటూ ఐక్యంగా ఉండాలని ఉమ్మడి నిజాంబాద్ జిల్లా మాజీ వైశ్య సంఘం అధ్యక్షుడు వంగపల్లి నాగభూషణం గుప్త పిలుపునిచ్చారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని వైశ్య భవన్ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించిన అనంతరం మండల సంఘం అధ్యక్షుడు సిద్ది శ్రీధర్ గుప్తా తో కలిసి మాట్లాడారు. సమాజ సేవలో వైశ్యులంతా ముందుంటారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ప్రజలతో మమేకమవుతారని కితాబిచ్చారు. వందల సంవత్సరాల నుంచి వైశ్యులు లేని ఊరు లేదన్నారు. వ్యాపారంలో రాణిస్తూ సమాజ సేవలో కూడా ముందుంటారని ఆయన వివరించారు. మన దేశంలోనే పెద్ద పెద్ద వ్యాపారులంతా వైశ్యులన్నారు. తమ వ్యాపారాల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉద్యోగులను ఒక కుటుంబంలో భావించే వారే వైశ్యులన్నారు. వైశ్యులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. వివాదాలకు దూరంగా ఉండే ఏకైక జాతి వైశ్య కులస్తులు అన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న వైశ్యులు రాజకీయాల్లో కొంచెం వెనుకబడ్డారని, రాజకీయాల్లో కూడా రాణించాల్సి ఉందన్నారు. వైశ్యులు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఉత్తమ సేవలు అందుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక వైశ్య భవన్ పునర్నిర్మాణానికి తన వంతుగా ఐదు లక్షల పదహారువేల ఒక వంద 16 రూపాయలు ప్రకటించారు. సంఘ భవన పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం ఇవ్వాలని ఆయన కోరారు.సిద్ది శ్రీధర్ గుప్తా మాట్లాడుతూ అందరి సహకారంతో అత్యంత సుందరంగా వైశ్య భవన్ ను నిర్మిస్తామన్నారు. అంతకుముందు భవన పునర్నిర్మాణానికి బ్రాహ్మణోత్తములు కొండంబట్ల రాజు పంతులు భూమి పూజ, నవగ్రహాల పూజా తదితర పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైశ్యులు పాల్గొని భూమి పూజ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.