తుపానుపై ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి..జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్ ; అర్నబ్ తుపాను ప్రభావంతో వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు,అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు రైతులకు ముందస్తు సమాచారం అందిస్తూ పంటల నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆదివారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేస్తూ కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల ప్రకారం తుఫాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో. అప్రమత్తత కొనసాగించాలని సూచించారు.రైతులను ముందుగానే అప్రమత్తం చేసి పంట రక్షణ చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు అందించాలన్నారు. రైతులు తమ వరి కోతలను వాయిదా వేసుకోవాలన్నారు
పంటలు చేతికి వచ్చిన వరి ధాన్యాన్ని సంరక్షించుకోవాలని వర్షానికి ధాన్యం తడవకుండా టార్పొలిస్తో రక్షించుకోవాలన్నారు
అత్యవసర పరిస్థితుల్లో అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.