చీరాల, రేపల్లె లలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియను కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పరిశీలించిన జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్
బాపట్ల, మేజర్‌న్యూస్ :
"సమర్థ్" మొబైల్ యాప్ వినియోగించడం వలన నిమిషాల వ్యవదిలోనే గొడవలు జరిగిన ప్రదేశాలకు పోలీస్ బలగాలు చేరుకుంటున్నాయని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. నవంబర్ 01 న ఆదివారం జిల్లాలోని చీరాల, రేపల్లె లలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను జిల్లా ఎస్పీ గారు కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పరిశీలిస్తు ఎక్కడైన అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే "సమర్థ్" (SAMARTH) మొబైల్ యాప్, కమ్యూనికేషన్ సెట్ ల ద్వారా దగ్గరలో వున్న పోలీస్ అధికారులను అప్రమత్తం చేసి వేగంగా ఘటన స్థలానికి చేరుకొని శాంతి భద్రతలను పరిరక్షించే విధంగా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లా పోలిస్ ప్రధాన కార్యాలయంలోనే కమ్యూనికేషన్ విభాగాన్ని, ఐటి విభాగాన్ని, సమాచార విభాగాన్ని ఒకే చోట కేంద్రీకరించి కమాండ్ కంట్రోల్ ను ఏర్పాటు చెయ్యడం వలన ఎక్కడైనా శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు క్షణాల్లోనే స్పందించి పోలీస్ బలగాలను ఘటన స్థలానికి పంపి శాంతి భద్రతలు పరిరక్షించ గలుగుతున్నామని తెలిపారు. "సమర్థ్" (SAMARTH) మొబైల్ యాప్ ఎన్నికల ప్రక్రియలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది అందరు "సమర్థ్" మొబైల్ యాప్ వినియోగించడం వలన వారి లైవ్ లొకేషన్ ను ట్రాక్ చేస్తున్నామని, ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్న సమయంలో ఆ ప్రదేశంలో విధులు నిర్వహించే పోలీసులు ???? బటన్ నొక్కితే దగ్గరలో వున్న రూట్ మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ పార్టీ ల అధికారులను అప్రమత్తం చేసిన నిమిషాల వ్యవధిలోనే ఘటన స్థలానికి చేరుకొని శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నారన్నారు.
ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలో గొడవలకు, ఘర్షణలకు పాల్పడి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరిధిలో తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇతర పరిస్థితులతో పోలిస్తే ఎన్నికల సమయంలో తీసుకోను చర్యల చాల తీవ్రంగా ఉంటాయని ఎస్పీ గారు హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ గారితో పాటు ఎలక్షన్ సెల్ సీఐ వి.సూర్యనారాయణ, ఎస్బి సిఐ జి.నారాయణ, ఐటి కోర్ ఎస్సై లు ఏ.నాగేశ్వరరావు, అనుషా, ఇతర పోలీస్ అదికారులు, సిబ్బంది ఉన్నారు.