BREAKING
28వ డివిజన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చింతారెడ్డిపాళెంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైసీపీ మేయర్ అభ్యర్థి కుటుంబ సభ్యులు జోరుగా ఎన్నికల ప్రచారంలో స్వరూప్ రెడ్డి * సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన * సామాన్య ఓటర్లతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జడ్పిటిసి అభ్యర్థికి గజమాలతో స్వాగతం. మోటర్ బైక్‌పై పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్ల ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఎంబీయూలో 'ఐఈఈఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఐసిఏఈఎస్ఐఎస్-2026' విజయవంతం గ్రామాల అభివృద్ధి కి ప్రభుత్వం కృషి.. సామినేని ఉదయభాను బ్రెజిల్‌లో ప్రజా రవాణా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన లూలా వర్గీయులు! పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిరసన మహాసభ-రాహుల్ గాంధీని ప్రధాని చేసేంతవరకు విశ్రమించం: తాళ్లపెళ్లి శ్రీకాంత్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్ మృతుల కుటుంబాల ఆందోళన, సరైన విచారణ జరపాలని డిమాండ్!

చీరాల మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్

Select Suryaa Now
చీరాల మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను  పరిశీలించిన జిల్లా ఎస్పీ  బి.ఉమామహేశ్వర్

చీరాల, మేజర్‌న్యూస్‌ :

ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారు తెలిపారు. ఆదివారం చీరాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఎస్పీ గారు స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శృంగారపేటలోని మున్సిపల్ ప్రైమరీ స్కూల్, పేరాల ఏఆర్ఎం హైస్కూల్, మెయిన్ రోడ్డులోని ఎన్.ఆర్. అండ్ పి.ఎం. హైస్కూల్, యానాది కాలనీలోని మున్సిపల్ ప్రైమరీ స్కూల్, హరిప్రసాద్ నగర్‌లోని కమ్యూనిటీ హాల్ తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లను, పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్రమపద్ధతిలో క్యూలైన్లలో వెళ్లేలా చూడాలని, 100 మీటర్ల పరిధిలో ఎక్కడా గుంపులుగా ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని, ప్రతినిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తూ విధులు నిర్వహించాలని ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే సమాచారం అందించాలని పోలీసు అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. బాపట్ల జిల్లాలోని చీరాల, రేపల్లె మున్సిపాలిటీలలో జరుగుతున్న అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రత్యేకంగా లైన్ ఏర్పాటు చేశామని, ఆ పరిధిలో ఎవరూ గుంపులుగా గుమిగూడకుండా పర్యవేక్షణ చేపట్టామని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని ముందస్తు భద్రతా చర్యలు తీసుకుందని తెలిపారు.

చీరాల పట్టణంలో ఎన్నికల బందోబస్తు కోసం 19 రూట్ మొబైల్ లను, 14 స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలతో పాటు రిజర్వ్ పోలీస్ బలగాలను కూడా మోహరించినట్లు వెల్లడించారు. చీరాల పట్టణంలోని 44 వార్డుల్లో, రేపల్లె మున్సిపాలిటీ పరిధిలోని 35 వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని తెలిపారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా సమీపంలోని రూట్ మొబైల్ సిబ్బందికి,  పోలింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి తెలియజేయాలని లేదా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎలక్షన్ సెల్ కంట్రోల్ రూమ్ నంబర్ 8333813228 కు కాల్ చేసి సమాచారం అందించవచ్చని తెలిపారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులు, సమాచారంపై పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరిస్తుందని ఎస్పీ గారు స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియకు ఎవరైనా ఆటంకం కలిగించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ ఎల్.సుధాకర్ చీరాల డిఎస్పి ఎండి.మోయిన్, ఏఆర్ డిఎస్పి పి.కృష్ణంరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ జి.నారాయణ సంబంధిత పరిది ఎస్హెచ్ఓ లు, ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది ఉన్నారు.