BREAKING
'ఖేత్ బచావో అభియాన్' మహానేత ఎర్రన్నాయుడు ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తాం అంసానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అన్ని రంగాల ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవ అవగాహన కార్యక్రమాలు నవంబరు 1 నుండి 7 వరకు వరుస తుఫాన్ లతో రైతన్నకు కంటి మీద కునుకు కరువు ఆంధ్ర అండర్-23 జట్టుకు అనంతపురం క్రికెటర్ మచ్చా దత్త రెడ్డి ఎంపిక 1675 పరుగులు, 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు.. 114 సిక్సర్లతో అదరగొట్టిన యువ క్రికెటర్ 50 లక్షలు స్వంత నిధులతో కల్యాణమండపం నిర్మిస్తాం.. ఎమ్మెల్యే అమిలినేని. బలి కోరిన మృత్యు మలుపు: కృష్ణ మహంతి చెరువులో కారు బోల్తా.. మర్రిపాలెం యువకుడు మృతి! పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఇంట్లో భారీ బీభత్సం.. గోడలు కూలి మహిళకు తీవ్ర గాయాలు ఆసియన్ టెన్నిస్ బాల్ క్రికెట్‌లో భారత్‌కు స్వర్ణం.. అనంతపురం క్రీడాకారిణి షైక్ షాహీదాకు బంగారు పతకం కూటమి ప్రభంజనం - పేరూరు గ్రామంలో దూసుకుపోతున్న ప్రచారం కార్తీకమాసం ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యుత్ పొదుపుపై అవగాహన

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు ఎంపీ డీకే అరుణ మద్దతు

Select Suryaa Now
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు ఎంపీ డీకే అరుణ మద్దతు

నారాయణపేట, సూర్యన్యూస్: జాతీయ ఆరోగ్య మిషన్‌ కాంట్రాక్టు ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 20వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న సమ్మె శిబిరాన్ని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మెకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో జాతీయ ఆరోగ్య మిషన్‌ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో జాతీయ ఆరోగ్య మిషన్‌ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించినట్లు పేర్కొంటూ, తెలంగాణలోనూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వారి కృషి వల్ల మాతృ మరణాల రేటు 25 శాతం నుంచి 19 శాతానికి, నవజాత శిశు మరణాల రేటు 15 శాతం నుంచి 5 శాతానికి తగ్గినట్లు తెలిపారు. అలాగే ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం 70కి చేరడంలో ఉద్యోగుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. క్షయ వ్యాధి రహిత భారతదేశం లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, క్షయ వ్యాధి నివారణకు వారు నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు. ఇంతటి కీలకమైన సేవలు అందిస్తున్న ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కల్పించకపోవడం, వేతనాలను సకాలంలో చెల్లించకపోవడం బాధాకరమని ఎంపీ పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రతంగ్ పాండు రెడ్డి, పగడాకుల శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్‌, భాస్కర్‌, ఎన్‌హెచ్‌ఎం యూనియన్ గౌరవ అధ్యక్షులు బిక్షపతి, అధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి వెంకట రమణ, కోశాధికారి రాఘవేందర్‌ సభ్యులు నరసింహారావు సగరి, మోనేష్ చారి, తిరుపతి, విరోజ, నవీన, శ్రీలత, అర్చన, ఐశ్వర్య, నవ్య దీప్తి, శ్వేత శ్రీ, రామస్వామి, వినోద్, గాయత్రి, అజారుద్దీన్, ఆశ బి, రామేశ్వరి, అపర్ణ, నాగజ్యోతి, పుష్ప, సుమిత్ర, అలివేలు పాల్గొన్నారు.

– రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.