BREAKING
నెల్లూరులో జోరుగా పోలింగ్.. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలతకు ఇదే నిదర్శనం: వీపీఆర్ దంపతులు అభివృద్ధి సంక్షేమం కోసం టిడిపిని గెలిపించాలి మురసు తుపాను హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో విద్యుత్ శాఖ అప్రమత్తం గంజాయి సేవిస్తున్న ఆరుగురు వ్యక్తుల గుర్తింపు – మరో ఇద్దరి వద్ద పావు కిలో గంజాయి స్వాధీనం**గంజాయి సేవించిన ఆరుగురిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు – గంజాయి కలిగి ఉన్న ఇద్దరికి రిమాండ్* మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి! మానవత్వం చాటుకున్న మజ్జి సిరి సహస్ర రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం.. సొంత కారులో ఆసుపత్రికి తరలింపు వరకవిపూడిలో వైసీపీ దాదాపు ఖాళీ జర్మనీలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న జెన్-జీ నిరసనలు ఓటువేసిన అవనాపు భార్గవి... ఫుడ్ పార్క్ వ్యవహారంలో భారీ కుంభకోణం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. --రైతులు విలవిలలాడుతుంటే ముఖ్యమంత్రి ఉచిత సలహాలు --బీజేపీ జాతీయ నేత, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజం స్వయం పాలన ఉద్యమ సారథి కుంమ్రం భీం -కొత్తగూడ మండల కేంద్రంలో ఘనంగా 86వ వర్ధంతి వేడుకలు పాచిపెంటలో వైసీపీ భారీ ర్యాలీ .. ఎంపీపీ అభ్యర్థి డోల చిత్తూరు మండలంలో కూటమి ప్రచార హోరు గువ్వకల్లు, పెరుమలకండిగలో ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి మంజుల శశికర్ బాబు విస్తృత పర్యటన. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ – విశాఖలో ‘బ్రెయిన్ షిప్స్’ నిర్మాణం: రేపటి చెస్ గ్రాండ్‌మాస్టర్లకు ప్రోత్సాహం అద్దంకిలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి గొట్టిపాటి.

ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌

Select Suryaa Now
 ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌

 

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా ర్యాలీకి తరలివచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సంకల్పంతో ఢిల్లీకి తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరికీ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తల సేవలను అభినందిస్తూ ప్రతి ఒక్కరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. ఇండియా కూటమి నిర్వహించనున్న మెగా ర్యాలీని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులంతా ఐక్యంగా కృషి చేయాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి అండగా నిలవాలని, ఈ ఉద్యమంలో ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా పాల్గొనాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.