andhrapradesh
అద్దంకిలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి గొట్టిపాటి.
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి పట్టణంలోని సంజీవ్ నగర్ లోని 26వ వార్డు పోలింగ్ బూత్ లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సామాన్య పౌరుడి మాదిరిగా క్యూ లైన్ లో ఓటర్లందరితో కలిసి పోలింగ్ బూత్లోకి వెళ్లారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం బయట మీడియాతో మాట్లాడారు. గత రెండన్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలే రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల విజయానికి బాటలు వేస్తాయని పేర్కొన్నారు. పురపాలక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించి, అత్యధిక మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. మంత్రి తో పాటు చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్, తదితరులు ఉన్నారు.