పాచిపెంటలో వైసీపీ భారీ ర్యాలీ .. ఎంపీపీ అభ్యర్థి డోల
పాచిపెంట, సూర్య : ఈనెల 5వ తేదీన జరగబోయే స్థానిక ఎన్నికలకు ముందుగా వైయస్సార్ పార్టీ మన బలం ఏమిటో ప్రత్యర్థులుకు సవాల్ విసిరింది.మండల కేంద్రమైన పాచిపెంట గ్రామంలో ఆదివారం నాడు వైయస్సార్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది.ఈ ర్యాలీని చూసి టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.జన ప్రభంజనాన్ని చూసి తుల్లు పడ్డారు.వైసీపీ గెలుపు నల్లేరు పై నడక అని చెప్పక తప్పదు అంటున్నారు.. ర్యాలీ వీక్షించిన ప్రజానీకం.హరిజన వీధి నుంచి మాదిగ వీధి,రెల్లి వీధి, మొకరవీధి, నాయుడు వీధి, శాలపు వీధి, దాసరివీది,మంత్రి వీధి, ఎగువ వీధి నుంచి వందలాదిమంది వైయస్సార్ పార్టీ ఓటర్లు,అభిమానులు నాయకులు, ప్రజలు ప్రజలు ఒక్కసారిగా ర్యాలీలో నినాదాలు చేశారు. వైయస్సార్ పార్టీని గెలిపించండి. ఎంపీపీగా డోల బాబ్జికి అవకాశం ఇవ్వండి. మండల అభివృద్ధికి సహకరించండి. అంటూ ముందుకు నడవసాగారు. ప్రతీ వీధిలో ఎంపీటీసీ అభ్యర్థులకు జడ్పిటిసి అభ్యర్థి పుష్పకు పూలదండలతో స్వాగతం ఇచ్చారు. మహిళలు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు. పాచిపెంట ప్రజలు,మహిళలను ఉద్దేశించి ఎంపీపీ అభ్యర్థి డోల బాబ్జి మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇస్తే మండల అభివృద్ధి చేసి చూపిస్తానని,మీ అందరికీ అందుబాటులో ఉంటానని,మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని, నాతో పాటు 14 మంది ఎంపీటీసీలను అత్యధిక మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ప్రజలకు పూర్తి స్థాయిలో త్రాగునీటి సౌకర్యము కల్పించడమే నా ధ్యేయమని పేర్కొన్నారు. మండల అభివృద్ధి కోసము రహదారులు నిర్మాణం చేపడతానని, కాలువలు చిన్నచిన్న కాజు వేలు నిర్మించి డ్రైనేజీ సమస్య లేకుండా ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఉపాధి కూలీలకు సకాలంలో ఉపాధి పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. ఆయన ఇచ్చిన హామీలకు ప్రజలు హర్షద్వానాలతో వారి మద్దతు తెలియజేశారు. వైయస్సార్ పార్టీకి పాచిపెంట మండలం కంచుకోటగా నిలిచిందని అదేవిధంగా ఈసారి కూడా వైయస్సార్ పార్టీకి అండగా ప్రజలు నిలవాలని ఆయన కోరారు.ఈ ర్యాలీ లో జడ్పిటిసి అభ్యర్థి కలువులపల్లి పుష్ప, ఎంపీటీసీ అభ్యర్థులు, మాజీ వైస్ ఎంపీపీ టీ గౌరీశ్వరరావు, తాజా మాజీ వైస్ ఎంపీపీ ప్రతినిధి మీసాల చంటి,టౌన్ నాయకులు మజ్జి వెంకటరావు, మంత్రి సత్యనారాయణ, దండి ఆదినారాయణ,డోల యువసేన, నాయకులు కార్యకర్తలు వైయస్సార్ పార్టీ అభిమానులు ప్రజలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.