BREAKING
ఘనంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి జన్మదిన వేడుకలు పులివెందులలో రిగ్గింగ్‌కు పాల్పడుతూ ఫేక్ ప్రచారం చేస్తున్న జగన్ రెడ్డి ప్రమిలమ్మ దాడి జరిగిందనేది అవాస్తవం --- పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి సైదాపురం సెగ్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తా అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు, మద్దతు కోరుతున్నా ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోన్న ఆది సాయికుమార్ ఎస్ఐ యుగంధర్ సినిమా బీసీ కాలనీలో స్థల వివాదం.. జేసీబీతో హడావుడిగా చదును! పోలింగ్ కేంద్రం లోకి అభ్యర్థిని రానివ్వని సీఐ గంగాధర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన బీఆర్ఎస్ నాయకులు బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన మంత్రి లోకేష్. బాలికకు అందుతున్న చికిత్సపై వైద్యులతో చర్చించిన మంత్రి ఆత్మకూరులో జోరుగా ప్రశాంతంగా ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సీసీ రోడ్డు పనులకు ఎంపీ రఘునందన్ రావు శ్రీకారం టిపిటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక దెబ్బతిన్న రైతన్న ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం దే అంతిమ యాత్ర .... (కథ) వింజమూరులో హోరాహోరీగా ప్రచారం ఆత్మకూరులో ప్రజల నుంచి విశేష స్పందన - 28 వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం - మంత్రి ఆనం

మురసు తుపాను హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో విద్యుత్ శాఖ అప్రమత్తం

Select Suryaa Now
మురసు తుపాను హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో విద్యుత్ శాఖ అప్రమత్తం

నెల్లూరు,  మేజర్ న్యూస్ :    మురసు తుపాను హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్  శివశంకర్ లోతేటి, ఐఏఎస్ గారు నెల్లూరు జిల్లాకు ప్రత్యేక అధికారిగా  జె. రమణాదేవి, చీఫ్ జనరల్ మేనేజర్ గారిని నియమించారు. ఈ నేపథ్యంలో ఆమె నేడు హుటాహుటిన నెల్లూరు జిల్లాకు చేరుకుని తుపాను సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి సారించారు.

అన్ని విభాగాల అధికారులతో సమన్వయం – పకడ్బందీగా ముందస్తు చర్యలు

ఈ సందర్భంగా సీజీఎం  జె. రమణాదేవి  మాట్లాడుతూ, సీఎండీ గారు తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా జిల్లాలో విద్యుత్ శాఖ తరఫున అన్ని ముందస్తు చర్యలు పకడ్బందీగా చేపడుతున్నామని తెలిపారు. జిల్లా ఎస్ఈ శ పి. సుధాకర్ గారితో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్ల సమన్వయంతో సమష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.

సబ్ డివిజన్ల వారీగా నోడల్ అధికారులు – ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు

సీఎండీ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లకు నోడల్ అధికారులను నియమించడంతో పాటు, ప్రతి సబ్ డివిజన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి విపత్తు ఎదురైనా ముందుగా తాగునీటి సరఫరా వ్యవస్థలు, ఆసుపత్రులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడానికే తొలి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

విద్యుత్ సామగ్రి సిద్ధం – మెటీరియల్ కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు

ఇప్పటికే జిల్లా ఎస్ఈ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రతి ప్రాంతంలో అవసరమైన విద్యుత్ సామగ్రి వివరాలను సేకరించినట్లు వెల్లడించారు. అవసరమైన విద్యుత్ స్తంభాలను ఇప్పటికే సమకూర్చామని, ఎక్కడా మెటీరియల్ కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

పోల్స్, జేసీబీలు, క్రేన్లు, డ్రిల్లింగ్ యంత్రాలు సిద్ధం

తుపాను ప్రభావం వల్ల విద్యుత్ లైన్లు, స్తంభాలు దెబ్బతిన్న సందర్భాల్లో వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అవసరమైన పోల్స్, జేసీబీలు, క్రేన్లు, పవర్ సా యంత్రాలు, డ్రిల్లింగ్ మిషన్లు తదితర సామగ్రిని ముందుగానే సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అందుబాటులో ఉన్న సామగ్రి ఎంత, అదనంగా ఎంత అవసరం అనే అంశాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.

విద్యుత్ సిబ్బందికి సెలవులు రద్దు – హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదు

తుపాను హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ శాఖ సిబ్బందికి సెలవులు మంజూరు చేయరాదని, ఎవరూ తమ హెడ్ క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని సీఎండీ గారు ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే సెలవుల్లో ఉన్న సిబ్బంది కూడా స్వచ్ఛందంగా విధుల్లో చేరి సహకరించాలని కోరారు. ప్రతి గంటకూ సీఎండీ గారు టెలికాన్ఫరెన్స్‌ల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారని వివరించారు.

తీర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా – నష్టాన్ని అంచనా వేసేలా కార్యాచరణ

జిల్లాలోని కోస్టల్ బెల్ట్, సముద్ర తీర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ సెక్షన్లు, విద్యుత్ స్తంభాల సంఖ్య, తుపాను ప్రభావం వల్ల సంభవించే నష్టాన్ని అంచనా వేస్తూ ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

ఆర్నాబ్ తుపాను పునరుద్ధరణ పనుల స్ఫూర్తితో మురసు తుపానును ఎదుర్కొంటాం

ఇప్పటికే మన విద్యుత్ శాఖ సిబ్బంది ఆర్నాబ్ తుపాను పునరుద్ధరణ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఎంతో కష్టపడి సేవలందిస్తున్నారని, వారి సేవలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సైతం అభినందించారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో మురసు తుపాను సమయంలోనూ నెల్లూరు జిల్లాలో ఎలాంటి విపత్తు ఎదురైనా అందరం ఐక్యంగా, సమన్వయంతో పనిచేసి విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

విపత్తును ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

తుపాను ప్రభావానికి ముందే అవసరమైన అన్ని వనరులను సిద్ధం చేసుకుని, విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని సీజీఎం జె. రమణాదేవి గారు తెలిపారు. విద్యుత్ శాఖలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.