BREAKING
వైకాపాను ఆదరించాలి: మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ​దేవనబండ, ఎంపీటీసీ-7 స్థానాల్లో వైకాపా ప్రచారం బొల్లారం డివిజన్ లో పార్కింగ్ లేకుండా అక్రమ నిర్మాణాలు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గుంతపల్లి సర్పంచ్‌ అనంత్ రెడ్డి తిరుమల శ్రీవారి ప్రసాదం అందజేత కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలి–: రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి శ్రీ మఠంలో 16 ఏళ్లలోపు చిన్నారులకు ఆయుర్వేద వైద్య సేవలు.. కొల్చారంలో పెద్దమ్మ తల్లి ఆలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవం నూజివీడు లో 72.30 శాతం పోలింగ్ శ్రీ మార్కండేయ మహర్షి శివాలయం నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి రామాయంపేటలో కేటీఆర్‌కు ఘన స్వాగతం టిపి టి ఎఫ్ నూతన కమిటీ ఎన్నికలు అభివృద్ధిని చూసి ఓటు వేయండి - కాపా శ్రీనివాసరావు జాహ్నవి గెలుపే లక్ష్యంగా పువ్వాడి ఎన్నికల ప్రచార పర్వం కేసీఆర్‌తోనే రైతులకు భరోసా కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు తప్పని తిప్పలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పురుగుల మందు తాగిన ఒక వ్యక్తి విషమించడంతో మృతి.

పులివెందులలో రిగ్గింగ్‌కు పాల్పడుతూ ఫేక్ ప్రచారం చేస్తున్న జగన్ రెడ్డి ప్రమిలమ్మ దాడి జరిగిందనేది అవాస్తవం --- పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి

Select Suryaa Now
పులివెందులలో రిగ్గింగ్‌కు పాల్పడుతూ ఫేక్ ప్రచారం చేస్తున్న జగన్ రెడ్డి  ప్రమిలమ్మ దాడి జరిగిందనేది అవాస్తవం  --- పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి

కడప:- ఫేక్ జగన్.. ఫేక్ షెడ్యూల్ ఇచ్చి.. ఫేక్ ప్రచారం చేస్తున్నాడని పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడుతున్న వైసీపీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హతే లేదని అన్నారు. వీడియో సందేశం ద్వారా ఆయన మాట్లాడుతూ..
“జగన్ రెడ్డి పులివెందులకు వచ్చింది ఓటు వేయడానికా? లేక తన అనుచరులతో దౌర్జన్యాలు చేయించి, తిరిగి తప్పుడు ప్రచారం చేయడానికా? పోలీసులకు తప్పుడు హెలికాప్టర్ షెడ్యూల్ ఇచ్చింది జగన్ రెడ్డి. అనుకున్న సమయం కంటే ముందుగానే వచ్చినా పోలీసులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అయినా సాక్షి మీడియాలో హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేదని, అడ్డుకున్నారని, ఇంధనం అయిపోవడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారు. పులివెందులలో హెలికాప్టర్‌కు ఇంధనం నింపే సదుపాయం ఉందా? ఇంధన సమస్యతో అత్యవసర ల్యాండింగ్ జరిగిందన్న ప్రచారంలోనే వారి ఫేక్ ప్రచారం బయటపడుతుంది” అని దుయ్యబట్టారు

యథేచ్ఛగా వైసీపీ రిగ్గింగ్
“మొత్తం 80 పోలింగ్ బూత్‌లలో 70 బూత్‌లలో వైసీపీ ఏజెంట్లు లేరంటూ జగన్ మరో ఫేక్ ప్రచారానికి తెరతీశారు. వాస్తవానికి జూనియర్ గర్ల్స్ కాలేజీలోని 9 బూత్‌ల వద్ద జగన్ బాబాయి మన్నవరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను రప్పించి టీడీపీ ఏజెంట్లపై రాళ్ల దాడి చేసి యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తున్నారు. సత్రంపల్లిలోని 4 బూత్‌లతో పాటు ఉర్దూ పాఠశాల, వెంకటాపురం, యలమారిపల్లి, భాగ్యరాపురం, జగన్ ఇంటి పక్కనున్న మరో 4 బూత్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వైసీపీ శ్రేణులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి అక్రమాలకు పాల్పడుతూ, తిరిగి మాపైనే నిందలు వేయడం జగన్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం” అని పేర్కొన్నారు.

ప్రమీలమ్మపై దాడి అంటూ ఫేక్ ప్రచారం
“కొన్ని పేపర్లు పట్టుకుని చూపిస్తూ, వారంతా ఏజెంట్లని చిత్రీకరించే ప్రయత్నం జగన్ చేస్తున్నాడు. వైఎస్ ప్రమీలమ్మపై దాడి జరిగిందంటూ మరో ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. జగన్ పక్కనే ఉన్న ఆమెకు ఎలాంటి గాయాలూ కనిపించలేదు. వాస్తవాలను పక్కనపెట్టి, ఏమీ జరగకుండానే జరిగిపోయినట్లు జగన్ చిత్రీకరించడం ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నాడు. 40 ఏళ్లుగా రిగ్గింగ్‌లు, దొంగ ఓట్లతో గెలుస్తూ వచ్చిన జగన్ రెడ్డికి, ఇప్పుడు ప్రజలు ఎదురుతిరగడంతో దిక్కుతోచడం లేదు. అందుకే తమ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందలు వేస్తూ, ఫేక్ ప్రచారానికి పాల్పడుతున్నారు” అని అన్నారు.

ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు
“నేను అధికార పార్టీలో ఉన్నప్పటికీ నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు అధికార పార్టీ నేతలను నిర్బంధిస్తూ, మరోవైపు వైసీపీ నేతలకు స్వేచ్ఛ కల్పిస్తుంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి ఎక్కడిది? నీకు అనుమతించింది ఓటు వేయడానికి మాత్రమే. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షోలు నిర్వహించి ఫేక్ ప్రచారం చేయడానికి కాదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలనుకుంటున్న జగన్ రెడ్డికి, వైసీపీకి మరోసారి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు” అని స్పష్టం చేశారు.