BREAKING
ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోన్న ఆది సాయికుమార్ ఎస్ఐ యుగంధర్ సినిమా బీసీ కాలనీలో స్థల వివాదం.. జేసీబీతో హడావుడిగా చదును! పోలింగ్ కేంద్రం లోకి అభ్యర్థిని రానివ్వని సీఐ గంగాధర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన బీఆర్ఎస్ నాయకులు బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన మంత్రి లోకేష్. బాలికకు అందుతున్న చికిత్సపై వైద్యులతో చర్చించిన మంత్రి ఆత్మకూరులో జోరుగా ప్రశాంతంగా ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సీసీ రోడ్డు పనులకు ఎంపీ రఘునందన్ రావు శ్రీకారం టిపిటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక దెబ్బతిన్న రైతన్న ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం దే అంతిమ యాత్ర .... (కథ) వింజమూరులో హోరాహోరీగా ప్రచారం ఆత్మకూరులో ప్రజల నుంచి విశేష స్పందన - 28 వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం - మంత్రి ఆనం ఎస్పీ చొరవతో వృద్ధురాలికి ఓటు వేసే అవకాశం బీజేపీ ప్రభుత్వం చేతుల్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలుబొమ్మ..కాంగ్రెస్ నాయకుల ధ్వజం! ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి.

హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ – విశాఖలో ‘బ్రెయిన్ షిప్స్’ నిర్మాణం: రేపటి చెస్ గ్రాండ్‌మాస్టర్లకు ప్రోత్సాహం

Select Suryaa Now
హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ – విశాఖలో ‘బ్రెయిన్ షిప్స్’ నిర్మాణం: రేపటి చెస్ గ్రాండ్‌మాస్టర్లకు ప్రోత్సాహం

సీతమ్మధార, సూర్య : భారతదేశ రక్షణ రంగానికి అత్యాధునిక నౌకలను నిర్మిస్తూ దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న విశాఖపట్నానికి చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థ హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ , ఇప్పుడు యువతలో మేధోశక్తిని పెంపొందిస్తూ భవిష్యత్తు చెస్ ఛాంపియన్లను తీర్చిదిద్దే కార్యక్రమానికి తన విలువైన సహకారాన్ని అందిస్తుందని ఒరిస్సా గవర్నర్ కంభంపాటి. హరిబాబు అన్నారు.విశాఖపట్నంలోని మద్దిలపాలెం కాకతీయ కన్వెన్షన్ సెంటర్‌లో నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహిస్తున్న 4వ జాతీయ పాఠశాలల అండర్-12 మరియు అండర్-18 టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్‌–2026కు హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది అని తెలిపారు. దేశ రక్షణ కోసం నౌకలను నిర్మిస్తున్న , రేపటి చెస్ గ్రాండ్‌మాస్టర్లుగా ఎదగబోయే యువ మేధావులను ప్రోత్సహిస్తూ విశాఖలో ‘బ్రెయిన్ షిప్స్’ నిర్మాణానికి కూడా తన వంతు సహకారాన్ని అందిస్తోంది. దేశ భద్రతను బలోపేతం చేసే నౌకల నిర్మాణంతో పాటు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువ మేధస్సుకు అండగా నిలవడం  ప్రత్యేకతగా నిలుస్తోంది అని తెలిపారు.ఈ ప్రతిష్ఠాత్మక మూడు రోజుల జాతీయ స్థాయి పోటీల్లో దేశవ్యాప్తంగా 50 పాఠశాలలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి జట్టులో నలుగురు క్రీడాకారుల చొప్పున మొత్తం 200 మంది యువ చెస్ క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు, టీమ్ మేనేజర్లు, కోచ్‌లు, అంపైర్లు  అధికారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు అని తెలిపారు. ప్రతిభను, ఉత్సాహాన్ని అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చెస్ ఛాంపియన్ల విజయాలను గుర్తుచేసుకుంటూ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన చెస్ ఛాంపియన్ల గురించి వివరించారు. యువ క్రీడాకారులు కష్టపడి సాధన చేసి, భవిష్యత్తులో దేశానికి మరింత మంది గ్రాండ్‌మాస్టర్లను అందించాలని ఆకాంక్షించారు. పాల్గొంటున్న అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షులు  సురేష్ ఆదుసుమిల్లి, ప్రధాన కార్యదర్శి  కె. జగదీష్ , చీఫ్ ఆర్బిటర్ ఐఏ దీపక్ కుమార్ నరేంద్ర, డిప్యూటీ చీఫ్ ఆర్బిటర్ ఐఏ  ఎన్. ఫణి కుమార్  పాల్గొని ప్రసంగించారు.ఆంధ్ర చెస్ అసోసియేషన్‌కు హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ అందిస్తున్న ఈ విశేషమైన సహకారం పట్ల అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ ఛాంపియన్‌షిప్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యువ ప్రతిభావంతులకు జాతీయ స్థాయి వేదిక లభించడమే కాకుండా, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి చెస్ ఛాంపియన్లు, గ్రాండ్‌మాస్టర్లుగా ఎదిగే క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు అవకాశం కలుగుతోంది అని తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక ఛాంపియన్‌షిప్‌ను ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ (AICF) ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్, విశాఖ చెస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. దేశ రక్షణకు నౌకల నిర్మాణం – దేశ భవిష్యత్తుకు మేధావుల నిర్మాణం. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ అందిస్తున్న ఈ సహకారం క్రీడా రంగంలో కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతకు ఒక చక్కని నిదర్శనంగా నిలుస్తోంది అని తెలిపారు.