చిత్తూరు మండలంలో కూటమి ప్రచార హోరు గువ్వకల్లు, పెరుమలకండిగలో ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి మంజుల శశికర్ బాబు విస్తృత పర్యటన.
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
చిత్తూరు మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గ్రామగ్రామాన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల మద్దతు కూడగట్టేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం గువ్వకల్లు, పెరుమలకండిగ గ్రామాల్లో ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి మంజుల శశికర్ బాబు ఆధ్వర్యంలో కూటమి నాయకులు సుడిగాలి పర్యటన నిర్వహించి ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను, మహిళలను, యువతను, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం, తాగునీటి సౌకర్యాల కల్పన, మురుగునీటి కాలువల నిర్మాణం తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు.రానున్న రోజుల్లో గ్రామాల సమగ్ర అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలంటే కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని జయచంద్ర నాయుడు, మంజుల శశికర్ బాబు కోరారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల నిరంతర కొనసాగింపు కోసం సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచారానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభించింది. మహిళలు, వృద్ధులు, యువత నాయకులతో మమేకమై తమ అభిప్రాయాలను తెలియజేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్న విశ్వాసాన్ని పలువురు వ్యక్తం చేశారు. దీంతో గ్రామాల్లో కూటమి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మోహన్ రాజ్, శ్రీకాంత్, శ్రీనివాసులు, మనోహర్ నాయుడు, రఘు, ముత్తుకూరు మోహన్, గిరి, రాము, నీలకంఠ నాయుడు, దేవరాజులు, బాలాజీ, ప్రిన్స్, శరవణ, కందస్వామి, రమేష్, చల్ల, నాగరత్నం, రెడ్డప్ప, మేషాక్, యోయ, మైకేల్, నయాజ్ తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్