విద్యుత్ ప్రమాదంలో గొర్రె మృతి
ఆత్మకూరు/ మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన కురువ నారాయణ గొర్రె ప్రమాదవశాత్తు గ్రామంలోనీ ట్రాన్స్ఫారం దగ్గరకు వెళ్లగా విద్యుత్ ప్రమాదంలో చనిపోయింది. ఇట్టి గొర్రె విలువ దాదాపు పదివేలు ఉంటుందని నారాయణ తెలిపారు. జీవనాధారం గొర్రెలు కావున ఆ నారాయణ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ రామచంద్రయ్య కోరుచున్నారు.