పర్చూరు గంగ, నాగులపాలెం గంగ పథకాలను సందర్శించిన రోటరీ గవర్నర్
పర్చూరు, మేజర్‌న్యూస్ :
రోటరీ క్లబ్ అఫ్ పర్చూరు సెంట్రల్ కు రోటరీ జిల్లా 3150 గవర్నర్ అధికార పర్యటన నిమిత్తం ఆదివారం క్లబ్ ను సందర్శించారు. ఈ సందర్బంగా పర్చూరు క్లబ్ సహకారం తో నిర్వహిస్తున్న పర్చూరు గంగ మరియు నాగులపాలెం గంగ తాగునీటి పధకాలు సందర్శించారు. తదుపరి రోటరీ భవన్ లో అధ్యక్ష, కార్యదర్సులతో ఆంతరంగిక సమావేశంలో క్లబ్ రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్త పరచారు. తదుపరి ప్రెస్ మీట్ లో జిల్లా వ్యాప్తంగా రోటరీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. తదుపరి రోటరీ సభ్యులతో సమావేశం నిర్వహించి, క్లబ్ రజతోత్సవ సంవత్సరం లో క్లబ్ బలోపేతం కు మరియు సేవా కార్యక్రమాలకు తగు సూచనలు చేశారు. రోటరీ జిల్లా 3150 కు 2028-29 సంవత్సరానికి కె ఎస్ ఆర్ కె ప్రసాద్ గారిని గవర్నర్ గా అందించిన క్లబ్ కు అభినందనలు తెలియచేస్తూ,కాబోయే గవర్నర్ క్లబ్ గా ఈ సంవత్సరం నుండే ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈరోజు నూతన సభ్యులు గా కొల్లా వీరయ్య చౌదరి, తేళ్ళ రాము ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమాలలో అధిక సంఖ్య లో సభ్యులు పాల్గొన్నారు