నెల్లిమర్ల నగరపంచాయతీ ఎన్నికలు ప్రశాంతం * * 80.31 శాతం పోలింగ్ నమోదు *
నెల్లిమర్ల, సూర్య : నెల్లిమర్ల నగరపంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి పెద్ద అవాంతరాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసింది. స్వల్ప సంఘటనలు మినహా ఓటర్లు పెద్దఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 23 వార్డుల్లో.. 80.31% పోలింగ్ శాతం నమోదైంది. 19075 ఓట్లకు గాను 15320 ఓట్లు పోలయ్యాయి. అదనపు ఎస్పీ పి. కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. డిఎస్పీ లక్ష్మణమూర్తి, సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ గోపాలరావుల నేతృత్వంలో నిరంతర పర్యవేక్షణ చేశారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోలేదని, ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వాడుకున్నారని అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపునకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.