గెలుపు ఖాయం.. మెజార్టీ పైనే ఆశలు
పూసపాటిరేగ, సూర్య : జడ్పిటిసి అభ్యర్థినిగా జనసేన తరుపున విజయం సాధించడం ఖాయమని, మెజార్టీ సాధించడమే లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు కూటమి తరుపున జనసేన జడ్పిటిసి అభ్యర్థి కోట్ల రేవతి అన్నారు. మండలంలోని కనిమెల్ల, కామవరం, కందివలస, గోవిందపురం గ్రామాల్లో కూటమి తరుపున పోటీ చేస్తున్న జనసేన, తెదేపా ఎంపీటీసీల అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని కోట్ల రేవతి ఆదివారం నిర్వహించారు. కనిమల్ల ప్రచార సభలో తెదేపా నాయకుడు సూర్యనారాయణ రాజుతో కలిసి ప్రచారం నిర్వహించి, జడ్పిటిసిగా తన ఆశీర్వదిస్తే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేయడమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. కందివలస ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో జనసేన నాయకుడు జలపారి శివతో కలిసి జడ్పిటిసి అభ్యర్థిని రేవతి కూటమి అభ్యర్థుల గెలుపుకు రేవతి ప్రచారాన్ని నిర్వహించి కూటమిలో విజయం స్థానిక ఎన్నికల పోరులో సాధించాక మారుమూల గ్రామాలను బంగారు బాటలుగా తీర్చిదిద్దడమే కాకుండా, మహిళలు, యువత ఉపాధి అవకాశాలపై దృష్టి సారించే విధంగా కృషి చేస్తానంటూ ఎన్నికల ప్రచార సభలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గోవిందపురం లో కూడా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విక్రమ్ జగన్నాథంతో కలిసి రేవతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రేవతి చేపట్టే ప్రచార సభలకు అనూహ్య రీతిలో స్పందన రావడమే కాకుండా పెద్ద ఎత్తున మహిళలు రేవతి జడ్పిటిసిగా ఘనవిజయం సాధించాలంటూ దీవెనలను అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు, జడ్పిటిసి అభ్యర్థిని రేవతి భర్త అయిన కోట్ల రఘు కూడా ప్రచార సభలో పాల్గొని ఓటర్లకు ప్రత్యేక ఆకర్షితులుగా నిలిచారు.