BREAKING
ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం అందించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. భూటాన్‌లోని గెలేఫులో అద్భుత ఘట్టం..ఏకకాలంలో 108 పవిత్ర బౌద్ధ చూర్టెన్ల నిర్మాణం! అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేలా దోహాలో ముమ్మర చర్చలు..! నెల్లిమర్ల నగరపంచాయతీ ఎన్నికలు ప్రశాంతం * 77.96 శాతం పోలింగ్ నమోదు * అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన టీమిండియా: క్యాలెండర్ ఇష్యూలో 400 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా చరిత్ర ఉక్రెయిన్ సంక్షోభంపై పోప్ లీయ్ కీలక వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి సర్కార్: ధర్మాన కృష్ణ దాస్ తీవ్ర ఆగ్రహం సీఎస్కే జట్టులో కొత్త బాధ్యతల్లోకి ఎంఎస్ ధోనీ: బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్‌గా వ్యవహరించే అవకాశంపై మాజీ క్రికెటర్ జోస్యం ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర దాడులు.. లక్షలాది మందికి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా! గెలుపు ఖాయం.. మెజార్టీ పైనే ఆశలు పర్చూరు గంగ, నాగులపాలెం గంగ పథకాలను సందర్శించిన రోటరీ గవర్నర్‌ దోషులకు కఠిన శిక్షలు తప్పవని అలెగ్జాండర్ డోబ్రిండ్ట్ హెచ్చరిక! పరుమల పెరున్నాళ్ సందర్భంగా కీలక నిర్ణయం.. నవంబర్ 2న తిరువల్లలో స్థానిక సెలవు అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ..! భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్‌గా అభిషేక్ శర్మ: యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఓట్ బచావ్–దేశ్ బచావ్ సభకు ఢిల్లీ చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు

Select Suryaa Now
ఓట్ బచావ్–దేశ్ బచావ్ సభకు ఢిల్లీ చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు

సూర్యా వెబ్ డెస్క్:  ఎస్‌ఐఆర్‌లో జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తున్న అవకతవకలకు నిరసనగా, ‘ఓట్ బచావ్–దేశ్ బచావ్’ నినాదంతో ఏఐసీసీ ఆధ్వర్యంలో నేడు దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఢిల్లీకి చేరుకున్నాయి.

టీపీసీసీ ఆదేశాల మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు సభకు సంబంధించిన కార్యక్రమాలు, ఏర్పాట్లు, అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై సభకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

కార్యక్రమంలో శాసనసభ్యులు డా. పట్లోళ్ల సంజీవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, సహచర ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీలో జరగనున్న బహిరంగ సభకు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద సందడి నెలకొంది. సభలో ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన అంశాలతో పాటు ఓటర్ల జాబితా, ప్రజాస్వామ్య ప్రక్రియకు సంబంధించిన అంశాలను కాంగ్రెస్ నాయకత్వం ప్రస్తావించనుంది.