BREAKING
ఓటీటీలోకి సూర్య బ్లాక్‌బస్టర్ ‘సీన్’.. నెల రోజుల్లోపే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్, డేట్ ఫిక్స్! పోక్సో కేసులో మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు ఆరనీకుమా ఈ దీపం .. కార్తీక దీపం చిరంజీవి పేరులో ‘N’ మాయం వెనుక సీక్రెట్ రివీల్.. ‘మెగావర్స్’ ప్రోమోతో నెట్‌ఫ్లిక్స్ సర్‌ప్రైజ్ పాదయాత్రను చేపట్టిన శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమ మహారాజ్ భాగ్యశ్రీ కుటుంబానికి అండగా నిలిచిన బీమా పథకం. ఆ భయానక ప్రమాదం తర్వాతే నాలో భక్తి పెరిగింది.. ఇండియన్ 2 ఘటనపై కాజల్ అగర్వాల్ ఎమోషనల్ రాజీవ్ హత్యపై రాహుల్ సంచలన ఆరోపణలు.. సినీ ప్రియులకు రామాయణ టీమ్ బంపరాఫర్.. కేవలం రూ.99కే థియేటర్లలో చూసే ఛాన్స్ శ్రీ గిరి గుట్ట పైన రెండవ గిరి ప్రదక్షిణ బైరెడ్డిపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థి భువచంద్రగౌడు కు మద్దతుగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే కదలని క్యూ లైన్లు..తిరగ బడ్డ భక్తులు..కొండగట్టు అంజన్న ప్రధాన ద్వారం మూసివేత గలగల గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసిపి సర్పంచ్ అభ్యర్థి సంతోష్ !! బిగ్‌బాస్ 12వ వారం నామినేషన్ల రచ్చ.. డేంజర్ జోన్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు, వీఐపీ పాస్ ట్విస్ట్ శ్రీ భీర లింగేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేయండి

తెలంగాణకు మరో ఆణిముత్యం.. ఏషియన్‌ చాంపియన్‌షిప్‌కు ఆకుల అక్షిత ఎంపిక

Select Suryaa Now
తెలంగాణకు మరో ఆణిముత్యం.. ఏషియన్‌ చాంపియన్‌షిప్‌కు ఆకుల అక్షిత ఎంపిక

చింతపల్లి, నల్గొండ జిల్లా: జాతీయస్థాయి త్రోబాల్‌ పోటీల్లో సత్తాచాటి భారత జట్టుకు ఎంపికై, ఏషియన్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనబోతున్న చింతపల్లి మండలం చాకలి శేరిపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారిణి ఆకుల అక్షితకు ఘన సత్కారం లభించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్‌రెడ్డి అక్షితను అభినందించి సన్మానించారు.

ఈ సందర్భంగా కంకణాల వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. అక్షిత అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి, తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది యువతలో అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని అన్నారు.

క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆకుల అక్షితకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఏషియన్‌ చాంపియన్‌షిప్‌లో అక్షిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి పతకం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

కార్యక్రమంలో సర్పంచ్ మాచర్ల శ్రీశైలం, ఉపసర్పంచ్ పగడాల వెంకటయ్య, ఆకుల జగతయ్య, వార్డు సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.