టీఎన్జీవో పట్టణ అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన టీయూడబ్ల్యూజే ఐజేయూ నేతలు
సంగారెడ్డి;సంగారెడ్డి పట్టణ టీఎన్జీవో అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన యాదవ రెడ్డిని టీయూడబ్ల్యూజే ఐజేయూ సంగారెడ్డి జిల్లా నాయకులు శనివారం ఘనంగా సన్మానించారు.సంగారెడ్డి డీపీఆర్వో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న యాదవ రెడ్డి ఇటీవల టీఎన్జీవో సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే. పైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆయనను శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘం నాయకులు మాట్లాడుతూ.. యాదవ రెడ్డి జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ సహకరిస్తూ ఉంటారని కొనియాడారు. టీఎన్జీవో సంఘం అభివృద్ధికి, ఉద్యోగుల సంక్షేమానికి సేవా దృక్పథంతో పనిచేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు, ఉద్యోగులకు సేవలందించాలని అభిలషించారు.ఈ కార్యక్రమంలో సదాశివపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హాజీ, చిన్న మధ్య తరహా పత్రికల సంఘం అధ్యక్షుడు సిద్ధిక్, సంఘ నాయకులు మతీన్, మసూద్, రఫిక్ నూరి, సత్తార్, రఫీ, ముజాహిద్, సత్యనారాయణ రెడ్డి, సిద్ధూ, శ్రీనివాస్, మహబూబ్ గౌరీ, షంషుద్దీన్, నాథిఖ్ తదితరులు పాల్గొన్నారు.