BREAKING
జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ కార్యక్రమంపై అవగాహన సదస్సు మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణపై కసరత్తు! యువత చూపు తెలుగుదేశం పార్టీ వైపు- మైనార్జీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్ దశాబ్దాల సమస్యకు తక్షణ పరిష్కారం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.. ఎంపీటీసీ బరిలో టీడీపీ అభ్యర్థి జంగం లావణ్య పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం- జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ. అద్దంకిలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్. పరిషత్ ఎన్నికలకు బందోబస్తు కావలిలో వైసీపీకి షాక్‌.. స్థానిక పోరు: తాడిమర్రిలో బోణీ కాని ఎంపీటీసీ నామినేషన్లు బాన్సువాడలో ఘనంగా రావణదహన కార్యక్రమం పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం – వారి సేవలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం తోటకూర వజ్రేష్ యాదవ్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన అలియాబాద్ కాంగ్రెస్ నేతలు వెబ్‌సైట్లను నిలిపివేయాల్సి రావచ్చని హెచ్చరించిన యూరోపియన్ ఏజెన్సీ జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి : జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశం

తాళ్లపేటలో దాడి.. ముగ్గురికి గాయాలు

Select Suryaa Now
తాళ్లపేటలో దాడి.. ముగ్గురికి గాయాలు

మంచిర్యాల జిల్లా,  సూర్య ప్రతినిధి : దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో జరిగిన దాడి ఘటనలో ఆరుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 20న సాయంత్రం 5.40 గంటల సమయంలో పేరం రజిత తన సోదరుడు ఆకుల రాజేంద్ర ప్రసాద్, మేనల్లుడు ఆకుల అకిరానందన్‌తో కలిసి జమ్మికి వెళ్తున్న సమయంలో పొరుగువారైన ఆకుల కిరణ్‌, ఆకుల రాజేందర్‌, ఆకుల సురేష్‌, ఆకుల విజయ్‌ వర్ధన్‌, ముట్టె కుమారస్వామి, ఎర్రం మల్లేష్‌ తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి అసభ్య పదజాలంతో దూషిస్తూ కర్రలు, చేతులతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ దాడిలో రాజేంద్ర ప్రసాద్‌, అకిరానందన్‌ల తలలకు, రజిత చేతికి గాయాలయ్యాయి. బాధితులను తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిందితులు బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దండేపల్లి పోలీసులు ఆకుల కిరణ్‌, ఆకుల సురేష్‌, ఆకుల విజయ్‌ వర్ధన్‌లను అరెస్ట్‌ చేశారు. మిగిలిన ముగ్గురు నిందితుల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.