BREAKING
భక్తిశ్రద్ధలతో శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర ముగిసిన మూట్ కోర్టు పోటీలు -విద్యార్థులలో అనుభవం కల్పించాలనే లక్ష్యం -న్యాయ అవగాహన కల్పించేందుకే ఈ పోటీలు -చైర్మన్ డా.ఆర్.తిప్పారెడ్డి టెలివిజన్ రంగంలో 2013 ఏడాదికి గాను పూర్ణగాధలు బెస్ట్ గ్రాఫిక్స్ కు నందిఅవార్డు విజయవంతంగా ముగిసిన నారెడ్కో తెలంగాణ 16వ ప్రాపర్టీ షో ముఖ్య అతిథి గా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు -ఎన్డీఏపై నమ్మకంతో ప్రజల తీర్పు -వైసీపీ ఆరోపణలను ఖండించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నరసింహ యాదవ్ యుద్ధాలు లేని సమాజ నిర్మాణమే ప్రపంచశాంతికి మార్గం రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటి చెప్పాలి పోలీసుల అదుపులో ఇద్దరు వైసిపి అభ్యర్ధుల భర్తలు. తెలుగుదేశం పార్టీలో చేరిన 50 వైకాపా కుటుంబాలు పలాసలో ప్రశాంతంగా పోలింగ్ - 70.13 శాతం నమోదు 6న దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ 7వ షోరూమ్ ప్రారంభం - సినీ నటీమణులు స్రవంతి చొక్కారపు, దివి, కామాక్షి భాస్కర్ల వెల్లడి టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచార జోరు మేఘవరంలో వైసీపీ అభ్యర్థుల ప్రచార జోరు జడ్పిటిసి అభ్యర్థి లక్ష్మీ తాయారును అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. కొండయ్య

స్వదేశీ వస్తువుల వినియోగానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనివ్వాలి -- హిందూ సమాజ ఐక్యత, భారతీయ సంస్కృతి పరిరక్షణే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం -- దేశవ్యాప్తంగా 2.50 లక్షల గ్రామాల్లో సంఘ్ శాఖలు కొనసాగుతున్నాయి -- విభాగ్ ప్రచారక్ దేవేందర్ జీ

Select Suryaa Now
స్వదేశీ వస్తువుల వినియోగానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనివ్వాలి -- హిందూ సమాజ ఐక్యత, భారతీయ సంస్కృతి పరిరక్షణే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం -- దేశవ్యాప్తంగా 2.50 లక్షల గ్రామాల్లో సంఘ్ శాఖలు కొనసాగుతున్నాయి -- విభాగ్ ప్రచారక్ దేవేందర్ జీ

నారాయణపేట, సూర్యన్యూస్: విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించి, స్వదేశీ వస్తువులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) విభాగ్ ప్రచారక్ దేవేందర్ జీ పిలుపునిచ్చారు. హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మ విలువలను భావితరాలకు అందించడమే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఘనంగా పథ సంచలన్ నిర్వహించారు. నారాయణపేట, దామరగిద్ద, ఊట్కూరు ఖండాలకు చెందిన స్వయంసేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పట్టణంలోని ప్రధాన పురవీధుల గుండా క్రమశిక్షణతో పథ సంచలన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు అడుగడుగునా పూలు చల్లుతూ స్వయంసేవకులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక మినీ స్టేడియం మైదానంలో నిర్వహించిన సభలో ముఖ్యవక్తగా పాల్గొన్న దేవేందర్ జీ మాట్లాడుతూ.. కుల, వర్ణ భేదాలకు అతీతంగా హిందూ సమాజాన్ని ఏకం చేయాలనే సంకల్పంతో డాక్టర్ జీ ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారని తెలిపారు. అనేక సంవత్సరాల పాటు విదేశీయుల పాలనలో ఉన్న భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో ఎందరో మహానుభావులు, త్యాగమూర్తులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. దేశభక్తి, ధర్మనిష్ఠ, జాతీయ భావాలను ప్రజల్లో పెంపొందించేందుకు వారు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ప్రపంచంలో సనాతన ధర్మానికి విశిష్టమైన స్థానం ఉన్న దేశం భారతదేశమని, భూమిపై దేవతలు నివసించిన పవిత్రమైన గొప్ప ప్రదేశం మన భారతదేశమని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ, సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. దేశంపై జరిగే విదేశీ కుట్రలను, సంఘ విద్రోహ శక్తుల కార్యకలాపాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల 50 వేల గ్రామాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. చిన్న వయసులోనే దేశభక్తి భావాలను అలవర్చుకోవాలని, సమాజ సేవను జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుగా ఎదగాలన్నదే సంఘ్ ఆకాంక్ష అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట సంఘ్‌చాలక్ డాక్టర్ మదన్మోహన్ రెడ్డి, ఊట్కూరు సంఘ్‌చాలక్ నీలి రాంరెడ్డితో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన స్వయంసేవకులు, సంఘ్ ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

– రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.