BREAKING
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో వైస్ చైర్మన్ గా వెంకట కార్తీక్. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ గా బుట్నా లక్ష్మి, ప్రమాణ స్వీకారం. ఏపీలో బియ్యం ధరలకు కళ్ళెం! తొలి టీడీపీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన హనీస్పందన ఇండోనేషియా ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపిక చైర్మన్‌గా నల్లా శ్రీధర్ ప్రమాణ స్వీకారం.... బ్రెజిల్ ఫెర్రోనికెల్ డీల్‌పై ఐరోపా ఉక్కు సంస్థల డిమాండ్ ప్రపంచ మార్కెట్లలో ఒడుదొడుకులు నేడు ఎస్పీ, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చలు.. అఖిలేష్, రాహుల్ చేతిలో తుది నిర్ణయం బ్లాక్‌స్టోన్ నుంచి పీజీపీ గ్లాస్ కొనుగోలుకు బ్రూక్‌ఫీల్డ్ ఒప్పందం పొన్నూరు 38వ వార్డు లో జోరందుకున్న వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ సల్మాన్ ఎన్నికల ప్రచారం సేవల రంగం నెమ్మదించినా తయారీ డిమాండ్‌తో భారత్ ఆర్థిక జోరు ఐరోపాలో క్లౌడ్ సార్వభౌమత్వం దిశగా అడుగులు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లకు పాల్పడొద్దు.. వృద్ధుల సంరక్షణ, శిశు సంరక్షణకు 2030 లక్ష్యాలు

శ్రీ చిన్నజీయర్ స్వామీజీని కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర దివ్యక్షేత్ర శంకుస్థాపన, భూమిపూజ; స్వామీజీకి ఆహ్వానం

Select Suryaa Now
శ్రీ చిన్నజీయర్ స్వామీజీని కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర దివ్యక్షేత్ర శంకుస్థాపన, భూమిపూజ; స్వామీజీకి ఆహ్వానం

ఖమ్మం/హైదరాబాద్, సూర్య ప్రతినిధి: ఖమ్మం నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర దివ్యక్షేత్రానికి ఈ నెల 12వ తేదీన శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ శుభకార్యానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామీజీని ఆహ్వానించేందుకు ఆయన ముచ్చింతల్‌లోని ఆశ్రమానికి వెళ్లారు.

ఆశ్రమంలో స్వామీజీని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి, ఆయనకు పాదాభివందనం చేసి దివ్యాశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ నిర్మాణ ఏర్పాట్లపై స్వామీజీతో చర్చించారు. ఈ నెల 12న జరిగే శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమానికి విచ్చేయాలని కోరుతూ ఆహ్వానం అందజేశారు. ఈ వేడుకలు పరమపూజ్య చిన్న జీయర్ స్వామీజీ అమృత హస్తాల మీదుగా అత్యంత వైభవంగా జరగనున్నాయని మంత్రి తెలిపారు.

ఖమ్మం నగరంలోని అల్లీపురంలో ఈ ఆలయాన్ని మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు మంత్రి వివరించారు. ఈ భూమి విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని ఆయన చెప్పారు. ఇంత విశాలమైన స్థలంలో ఆలయం రానుండటం ఖమ్మం ప్రజలకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం లభించిందని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహకారంతో నిర్మాణ పనులను వేగంగా ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఈ మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై, స్వామీజీ ఆశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.