BREAKING
మాటెల్ కొత్త సీఎఫ్‌వోగా పీటర్ గ్రిఫిత్ నియామకం అన్నపూర్ణా దేవి అమ్మవారికి కుంకుమ తొ అభిషేకం జాతీయ స్థాయికి పూడిపర్తి బయాలజీ టీచర్ ప్రాజెక్టు సైలెన్స్ థెరప్యూటిక్స్‌ను కొనుగోలు చేసిన జర్మనీ దిగ్గజం మెర్క్ ఏపీ హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ను కలిసిన పల్లెటి వెంకటేష్ నాయుడు.. పెంచలకోనలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు 10 లక్షల కరెన్సీ తో జగన్మాత దర్శనం ప్రముఖ హాలీవుడ్ నటుడు రస్సెల్ బ్రాండ్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎన్నికల విధులకు సన్నద్ధం కావాలి :ఆర్వో పలమనేరు మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ల పరిశీలన పూర్తి ప్రభుత్వ విప్ గణబాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి పోలాండ్‌లో గూఢచర్యం తీవ్ర కలకలం తెదేపాలోకి వైకాపా నాయకులు జంప్...!! మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు దండా బత్తుల నరేష్* ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త విప్లవం

శాతవాహన యూనివర్సిటీలో 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి.మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం

Select Suryaa Now
శాతవాహన యూనివర్సిటీలో 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి.మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం

హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఏడు విశ్వవిద్యాలయాల్లో 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలకు 49 పోస్టులు కేటాయించినట్లు పేర్కొన్నారు.ఈ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో నంబర్లు 141, 142లను విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు. కామన్ గైడ్‌లైన్స్, రోస్టర్ విధానానికి అనుగుణంగా ఈ నెలాఖరు నాటికి నియామక నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని తెలిపారు.హుస్నాబాద్ ఇంజినీరింగ్ కళాశాలకు ప్రాధాన్యం:శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (హుస్నాబాద్)లో వివిధ విభాగాలకు సంబంధించి 38 పోస్టులు భర్తీ కానున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)లో 7, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 7, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో 7, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 5, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో 1, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 2 పోస్టులు ఉన్నాయి.అలాగే ఇంగ్లీష్‌లో 1, మ్యాథమెటిక్స్‌లో 2, ఫిజిక్స్‌లో 2, కెమిస్ట్రీలో 2 పోస్టులతో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 1, లైబ్రేరియన్ పోస్టు 1 భర్తీ చేయనున్నారుఇతర కళాశాలల్లోనూ ఖాళీల భర్తీ:శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో న్యాయ శాస్త్ర విభాగానికి 8 పోస్టులు ఎల్ఎండి క్యాంపస్ లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ లో ఫార్మసీ విభాగానికి రెండు పోస్టులు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో కామర్స్ విభాగానికి ఒక పోస్ట్ ను భర్తీ చేయనున్నారు.నాణ్యమైన ఉన్నత విద్యకు బాటలు:విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీతో ఉన్నత విద్యారంగం మరింత బలోపేతం అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశ భావం వ్యక్తం చేశారు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతోపాటు కళాశాలలో అధ్యాపకుల కొరత తగ్గించేందుకు ఈ నియామకాలు దోహదపడతాయని పేర్కొన్నారు అర్హత కలిగిన నిరుద్యోగ యువత నోటిఫికేషన్లను పరిశీలించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.