BREAKING
వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇళ్లపై ఈడీ దాడులు భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ అప్రమత్తం దశాబ్దాల తర్వాత ఆయిల్‌ఫెడ్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తొలి వన్డేలో భారత్ సంచలన విజయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి నెల్లూరు ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని సూచన ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ఉధృతి తుపాన్ వేళ బాధితులకు అండగా కౌన్సిలర్ కొల్లి రవికిరణ్!-నీట మునిగిన ఇళ్లు.. కష్టాల్లో ప్రజలు.. వెంటనే స్పందించి భోజనాలు ఏర్పాటు! పంటలను పరిశీలించిన సీపీఐ(ఎం)నేతలు పెద్దల ఆశీస్సులతో 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తాం తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం: ఎర్లీ మార్నింగ్ షోలకు గ్రీన్ సిగ్నల్ మహబూబాబాద్ లో పట్ట పగలే భారీ చోరీ.. సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. కొత్త సినిమాలకు రోజుకు ఆరు షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం

సెట్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం యూజీసీ-నెట్‌లో 99.44 పర్సంటైల్‌తో జేఆర్‌ఎఫ్‌ సాధన..

Select Suryaa Now
సెట్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం యూజీసీ-నెట్‌లో 99.44 పర్సంటైల్‌తో జేఆర్‌ఎఫ్‌ సాధన..

సూర్య కమ్మర్‌పల్లి నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌ గ్రామానికి చెందిన ఆకుల రామసాయి విద్యారంగంలో వరుస విజయాలు సాధించారు. ఇటీవల నిర్వహించిన యూజీసీ-నెట్‌ జూన్‌ 2026 పరీక్షలో ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌ విభాగంలో 300 మార్కులకు 178 మార్కులు సాధించి, 99.44 పర్సంటైల్‌తో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత పొందారు. దేశవ్యాప్తంగా ఓబీసీ కేటగిరీ నుంచి జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైన 37 మందిలో రామసాయి ఒకరిగా నిలిచారు.
2022లో నిర్వహించిన తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీఎస్‌-సెట్‌)లో 212 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ సెట్‌లోనూ ఓపెన్‌ కేటగిరీలో అర్హత సాధించారు. కామారెడ్డిలోని తెలంగాణ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ పూర్తి చేసిన రామసాయి, పాండిచ్చేరి సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంఎస్సీ ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అభ్యసించారు. ప్రస్తుతం అదే విశ్వవిద్యాలయంలో జేఆర్‌ఎఫ్‌ సాయంతో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆయన విజయాల పట్ల ఉప్లూర్‌ గ్రామస్తులు కుటుంబికులు ఎంతో ఆనంద వ్యక్తం చేశారు..