వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్
జి.కొండూరు, మేజర్ న్యూస్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలో జి.కొండూరు మండలం వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నీటి ప్రవాహాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పరిశీలించారు. బుడమేరు వాగుపై వరద ప్రభావాన్ని అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నీటి ప్రవాహం సాధారణ స్థాయిలోనే కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఎలాంటి ముంపు పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.