BREAKING
పేదల సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం మున్సిపల్ చైర్మన్ నగేష్ షట్కర్ వరదలో చిక్కుకున్న వ్యక్తికి పునర్జన్మ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజల సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. *రోడ్డు వేయలేరా..బురదలోనే బతకాలా...?* *వైరా 11వ వార్డులో మాలపల్లి రహదారి అధ్వానం*. *వర్షం వస్తే బురద కష్టాలు..రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు* *పట్టించుకోని అధికారుల తీరుపై కాలనీవాసుల ఆవేదన ప్రశాంత వాతావరణం లో ఎన్నికల జరిగేందుకు ప్రజల సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల సాకారం సిర్గాపూర్ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి రైతులు కొనుగోలు కేంద్రాలనే సద్వినియోగం చేసుకోవాలి- మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మెకానిక్ కుటుంబాలకు టపాసులు పంపిణీ భీమిని మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన ప్రభుత్వ పాఠశాలలు, తహసీల్దార్ కార్యాలయం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన పర్యాటక శాఖ అధికారులతో కలిసి కమలాపూర్ చేరువును సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్.పి సంజీవరెడ్డి అభివృద్ధి సంక్షేమానికే ప్రజలు పట్టం కడుతారు. పో రెడ్డి రాజశేఖర్ రెడ్డి జడ్పిటిసి అభ్యర్థి తిమ్మాపూర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతి 35వ డివిజన్‌లో రెండోసారి ఘన విజయం సాధించిన ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి ముస్లింల విద్యాభివృద్ధికి ఎంఐఎం కృషి - నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్

గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షిష

Select Suryaa Now
గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షిష

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి :విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. బుధవారం నార్నూర్ మండలం గంగాపూర్(జి) గ్రామంలో గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని విద్యార్థుల హాజరు శాతం, మౌలిక వసతులను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి బోధనా ప్రమాణాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యంపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం అందించాలన్నారు. పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులు, సిబ్బందికి సూచించారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను కలెక్టర్ పరిశీలించి అభినందించారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలోని బోర్ వద్ద ఇంకుడు గుంత నిర్మించాలని ఆదేశించారు. అంతకుముందు గ్రామస్థులు పాఠశాల ఆవరణలో ప్రహరీగోడ నిర్మించాలని, నూతన అంగన్వాడీ భవనం మంజూరు చేయాలని కోరాగా, ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ ప్రక్రియలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, తహసిల్దార్ రాజలింగు, ఎంపిడిఓ పుల్లయ్య, ఉపాధ్యాయురాలు శోభా, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.