ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి :ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్‌కు చెందిన కె. పవన్ కళ్యాణ్ (28)కు నిందితుడు గవాండే గజానంద్ గతంలో అద్దెకు పక్కింట్లో ఉండటం ద్వారా పరిచయం ఏర్పడింది. 2021 నుండి 2024 మధ్య ఆర్టీసీ కార్గోలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, విడతలవారీగా ఫోన్ పే ద్వారా రూ.60,000/- మరియు నగదు రూపంలో రూ.40,000/- కలిపి మొత్తం రూ.1,00,000/- తీసుకున్నాడు.డబ్బులు తీసుకున్న అనంతరం ఉద్యోగం ఇప్పించకుండా, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా బాధితుడిని మోసం చేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ రేపు, ఎల్లుండి అంటూ కాలయాపన చేశాడు. డబ్బులు అడిగేందుకు ఇంద్రవెల్లిలోని నిందితుడి ఇంటికి వెళ్లిన బాధితుడిని నిందితుడు మరియు అతని భార్య బెదిరించడంతో బాధితుడు భయపడి వెనుదిరిగాడు. చివరకు బాధితుడి ఫిర్యాదు మేరకు మావల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి ముందస్తుగా డబ్బులు చెల్లించవద్దు. ఉద్యోగ నియామకాలు అధికారిక ప్రక్రియ ద్వారా మాత్రమే జరుగుతాయని గుర్తించాలి. ఎవరైనా ఉద్యోగం పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి.