BREAKING
మేయర్ రూప్ కుమార్ యాదవ్‌కు శుభాకాంక్షలు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత సహాయం పొందండి-టేకుమట్ల పారా లీగల్ వాలంటీర్ అంబాల రమేష్ మంత్రాలయంలో రాఘవ సరోవర ప్రాజెక్టుకు భూమిపూజ పెద్ద సిద్దపూర్ జీపీ లో పూర్తయినా ప్రారంభానికి నోచుకోని జీపీ భవనం..... ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు కులం పేరుతో దూషణలు, దాడులు, కుటుంబానికి ప్రాణహాని ఉందని కలెక్టర్ కు ఫిర్యాదు. గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షిష ఎన్నికల్లో అల్లర్లు సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు తప్పవ్:డీఎస్పీ ....390 మంది సిబ్బందితో పటిష్ట చర్యలు..… ఇద్దరికీ డాక్టరేట్లు ప్రధానం సెంట్రల్‌లో 29 స్థానాలకు 28 చోట్ల కూటమి విజయం: బొండా ఉమామహేశ్వరరావు జ్యోతికి డాక్టరేట్ అర్హులైన పట్టభద్రులు వెంటనే ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: కాంగ్రెస్ మండల కార్యదర్శి సంకు శంకర్ తెలుగుదేశం పార్టీలో చేరిన రామచంద్రప్పకు ఘన సన్మానం. నాగాయలంకలో ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించిన కలెక్టర్ డీకే బాలాజీ వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి

Select Suryaa Now
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి

యాదాద్రిభువనగిరి: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం భువనగిరి మండలం బొల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.ఆసుపత్రికి రోజూ వస్తున్న రోగుల సంఖ్య, ఓపీ వివరాల ఆన్‌లైన్ నమోదు,అభా  రిజిస్ట్రేషన్లపై ఆరా తీశారు. రోగుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.గత నెలలో ప్రసవ తేదీలు ఉన్న గర్భిణులు ఎంతమంది? వారిలో ఎంతమందికి సాధారణ ప్రసవాలు నిర్వహించారంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాలకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ ప్రసవాలు నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, నిరంతర పర్యవేక్షణతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఆసుపత్రికి వచ్చిన గర్భిణులు, బాలింతలతో నేరుగా మాట్లాడి వైద్య సేవలు, హిమోగ్లోబిన్ శాతం, మందుల వినియోగంపై వివరాలు తెలుసుకున్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఐరన్‌తోపాటు పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలని సూచించారు. చిన్నారులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మనోహర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.