BREAKING
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజల సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. *రోడ్డు వేయలేరా..బురదలోనే బతకాలా...?* *వైరా 11వ వార్డులో మాలపల్లి రహదారి అధ్వానం*. *వర్షం వస్తే బురద కష్టాలు..రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు* *పట్టించుకోని అధికారుల తీరుపై కాలనీవాసుల ఆవేదన ప్రశాంత వాతావరణం లో ఎన్నికల జరిగేందుకు ప్రజల సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల సాకారం సిర్గాపూర్ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి రైతులు కొనుగోలు కేంద్రాలనే సద్వినియోగం చేసుకోవాలి- మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మెకానిక్ కుటుంబాలకు టపాసులు పంపిణీ భీమిని మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన ప్రభుత్వ పాఠశాలలు, తహసీల్దార్ కార్యాలయం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన పర్యాటక శాఖ అధికారులతో కలిసి కమలాపూర్ చేరువును సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్.పి సంజీవరెడ్డి అభివృద్ధి సంక్షేమానికే ప్రజలు పట్టం కడుతారు. పో రెడ్డి రాజశేఖర్ రెడ్డి జడ్పిటిసి అభ్యర్థి తిమ్మాపూర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతి 35వ డివిజన్‌లో రెండోసారి ఘన విజయం సాధించిన ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి ముస్లింల విద్యాభివృద్ధికి ఎంఐఎం కృషి - నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ పోలింగ్ కేంద్రాల వద్ద సమస్య సృష్టిస్తే కఠిన చర్యలు తప్పదు ఎస్ఐ సుమన్ మేయర్ రూప్ కుమార్ యాదవ్‌కు శుభాకాంక్షలు

నాగాయలంకలో ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించిన కలెక్టర్ డీకే బాలాజీ

Select Suryaa Now
నాగాయలంకలో ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించిన కలెక్టర్ డీకే బాలాజీ

నాగాయలంక, మేజర్ న్యూస్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. బుధవారం నాగాయలంక మండలంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పోలింగ్ బృందాలకు ఎన్నికల సామగ్రి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నాగాయలంక మండలంలో 45 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బంది సామగ్రిని స్వీకరించి, వాటిని సరిచూసుకుంటున్నారని, పరిశీలన అనంతరం సాయంత్రంలోగా కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మండలంలోని కొన్ని గ్రామాలు లంక ప్రాంతాల్లో ఉండటంతో పోలింగ్ సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని పడవల ద్వారా తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకుని ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.