BREAKING
సిర్గాపూర్ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి రైతులు కొనుగోలు కేంద్రాలనే సద్వినియోగం చేసుకోవాలి- మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మెకానిక్ కుటుంబాలకు టపాసులు పంపిణీ భీమిని మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన ప్రభుత్వ పాఠశాలలు, తహసీల్దార్ కార్యాలయం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన పర్యాటక శాఖ అధికారులతో కలిసి కమలాపూర్ చేరువును సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్.పి సంజీవరెడ్డి అభివృద్ధి సంక్షేమానికే ప్రజలు పట్టం కడుతారు. పో రెడ్డి రాజశేఖర్ రెడ్డి జడ్పిటిసి అభ్యర్థి తిమ్మాపూర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతి 35వ డివిజన్‌లో రెండోసారి ఘన విజయం సాధించిన ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి ముస్లింల విద్యాభివృద్ధికి ఎంఐఎం కృషి - నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ పోలింగ్ కేంద్రాల వద్ద సమస్య సృష్టిస్తే కఠిన చర్యలు తప్పదు ఎస్ఐ సుమన్ మేయర్ రూప్ కుమార్ యాదవ్‌కు శుభాకాంక్షలు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత సహాయం పొందండి-టేకుమట్ల పారా లీగల్ వాలంటీర్ అంబాల రమేష్ మంత్రాలయంలో రాఘవ సరోవర ప్రాజెక్టుకు భూమిపూజ పెద్ద సిద్దపూర్ జీపీ లో పూర్తయినా ప్రారంభానికి నోచుకోని జీపీ భవనం..... ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

దశాబ్దాల తర్వాత ఆయిల్‌ఫెడ్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్

Select Suryaa Now
దశాబ్దాల తర్వాత ఆయిల్‌ఫెడ్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్

దమ్మపేట, (సూర్య)-దశాబ్దాల తర్వాత తెలంగాణ ఆయిల్‌ఫెడ్ వివిధ కేటగిరీల కింద ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల రాష్ట్ర కీలక రైతు సంఘ నాయకులు మద్దినేని వెంకట్, బండి భాస్కర్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఒక ప్రకటనలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఓఎంఎస్ నెంబర్ 144, తేదీ 31.10.2026 ప్రకారం మొత్తం వివిధ కేటగిరీల కింద 73 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ నేతృత్వంలో నేరుగా అర్హులైన వారిని ఎంపిక చేసే ప్రక్రియ మొదలైందని వివరించారు.మేనేజర్ ఫైనాన్స్ 1 పోస్టు, మేనేజర్ ఓపీడీ/డీఓ 1, డిప్యూటీ మేనేజర్ మెకానికల్ 2, డిప్యూటీ మేనేజర్ హార్టికల్చర్/అగ్రికల్చర్ 3, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మెకానికల్ 7, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 3, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ 2, సీనియర్ ఆపరేటర్స్/ఫోర్‌మెన్ 1, ఎగ్జిక్యూటివ్ జనరల్ 9, ఏరియా ఆఫీసర్ 7, కెమిస్ట్ 4, ఫీల్డ్ ఆఫీసర్ 11, జూనియర్ ఆపరేటర్ 8, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ 14 పోస్టులు ఉన్నాయని తెలిపారు. వీటికి ఆయా విద్యార్హతల ప్రాతిపదికన రిజిస్ట్రార్ జేఎన్‌టీయూ నేతృత్వంలో పారదర్శకంగా ఎంపిక జరుగుతుందన్నారు.
దరఖాస్తు చేసుకోవాలనుకునే ఔత్సాహిక విద్యావంతులు టీఎస్ ఆయిల్‌ఫెడ్ హైదరాబాద్ కేంద్ర కార్యాలయాన్ని లేదా వెబ్‌సైట్‌ను సందర్శించి ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవచ్చని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పటిదాకా సిబ్బంది కొరత కారణంగా సమాఖ్య సవాలక్ష సవాళ్లను ఎదుర్కొన్నదని, అయినా నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించడం ముదావహం కాగా, చాలినంత సిబ్బంది చేతుల్లో ఉన్నప్పుడు మరింత మెరుగైన ఫలితాలను సాధించడం తథ్యమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.