BREAKING
వరదలో చిక్కుకున్న వ్యక్తికి పునర్జన్మ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజల సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. *రోడ్డు వేయలేరా..బురదలోనే బతకాలా...?* *వైరా 11వ వార్డులో మాలపల్లి రహదారి అధ్వానం*. *వర్షం వస్తే బురద కష్టాలు..రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు* *పట్టించుకోని అధికారుల తీరుపై కాలనీవాసుల ఆవేదన ప్రశాంత వాతావరణం లో ఎన్నికల జరిగేందుకు ప్రజల సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల సాకారం సిర్గాపూర్ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి రైతులు కొనుగోలు కేంద్రాలనే సద్వినియోగం చేసుకోవాలి- మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మెకానిక్ కుటుంబాలకు టపాసులు పంపిణీ భీమిని మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన ప్రభుత్వ పాఠశాలలు, తహసీల్దార్ కార్యాలయం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన పర్యాటక శాఖ అధికారులతో కలిసి కమలాపూర్ చేరువును సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్.పి సంజీవరెడ్డి అభివృద్ధి సంక్షేమానికే ప్రజలు పట్టం కడుతారు. పో రెడ్డి రాజశేఖర్ రెడ్డి జడ్పిటిసి అభ్యర్థి తిమ్మాపూర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతి 35వ డివిజన్‌లో రెండోసారి ఘన విజయం సాధించిన ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి ముస్లింల విద్యాభివృద్ధికి ఎంఐఎం కృషి - నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ పోలింగ్ కేంద్రాల వద్ద సమస్య సృష్టిస్తే కఠిన చర్యలు తప్పదు ఎస్ఐ సుమన్

అర్హులైన పట్టభద్రులు వెంటనే ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: కాంగ్రెస్ మండల కార్యదర్శి సంకు శంకర్

Select Suryaa Now
అర్హులైన పట్టభద్రులు వెంటనే ఎమ్మెల్సీ  ఓటు నమోదు చేసుకోవాలి: కాంగ్రెస్ మండల కార్యదర్శి సంకు శంకర్

మునుగోడు,మేజర్ న్యూస్:వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులు తమ ఓటును వెంటనే నమోదు చేసుకోవాలని మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సంకు శంకర్ బుదవారం ఒక ప్రకటనలో కోరారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6, 2026 చివరి తేదీ కావడంతో పట్టభద్రులు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.మునుగోడు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నివసిస్తున్న, 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు ఫారం-18 ద్వారా తమ ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, సరైన నాయకులను ఎన్నుకోవడం ద్వారా సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
నవంబర్ 6తో గడువు ముగియనున్న నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు వెంటనే ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు.

 

కె. ఇంద్రసేనారెడ్డి,మేజర్ న్యూస్,

మునుగుోడు ,నాల్గొండ