BREAKING
సిర్గాపూర్ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి రైతులు కొనుగోలు కేంద్రాలనే సద్వినియోగం చేసుకోవాలి- మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మెకానిక్ కుటుంబాలకు టపాసులు పంపిణీ భీమిని మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన ప్రభుత్వ పాఠశాలలు, తహసీల్దార్ కార్యాలయం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన పర్యాటక శాఖ అధికారులతో కలిసి కమలాపూర్ చేరువును సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్.పి సంజీవరెడ్డి అభివృద్ధి సంక్షేమానికే ప్రజలు పట్టం కడుతారు. పో రెడ్డి రాజశేఖర్ రెడ్డి జడ్పిటిసి అభ్యర్థి తిమ్మాపూర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతి 35వ డివిజన్‌లో రెండోసారి ఘన విజయం సాధించిన ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి ముస్లింల విద్యాభివృద్ధికి ఎంఐఎం కృషి - నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ పోలింగ్ కేంద్రాల వద్ద సమస్య సృష్టిస్తే కఠిన చర్యలు తప్పదు ఎస్ఐ సుమన్ మేయర్ రూప్ కుమార్ యాదవ్‌కు శుభాకాంక్షలు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత సహాయం పొందండి-టేకుమట్ల పారా లీగల్ వాలంటీర్ అంబాల రమేష్ మంత్రాలయంలో రాఘవ సరోవర ప్రాజెక్టుకు భూమిపూజ పెద్ద సిద్దపూర్ జీపీ లో పూర్తయినా ప్రారంభానికి నోచుకోని జీపీ భవనం..... ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ అప్రమత్తం

Select Suryaa Now
భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ అప్రమత్తం

విజయవాడ, మేజర్ న్యూస్: భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వర్షపు నీరు నిల్వ ఉండకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి తడవకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, వాగులు, వంకలు పొంగే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఎన్నికల వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా క్రేన్లు, జేసీబీలు అందుబాటులో ఉంచాలని, పోలింగ్, పోలీసు సిబ్బందికి భోజనం, వైద్యం, ఇతర కనీస సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాలు, ఏటిగట్ల వెంబడి రెవెన్యూ అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైతే డ్రోన్లను వినియోగించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని, భారీ వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అధికారులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.