BREAKING
పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్న తెలుగుదేశం నేతలు తెలంగాణ మత్స్య రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలిః కేంద్రమంత్రికి మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికార యంత్రాంగానికి ప్రశంసలు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న తొండపు దశరథ జనార్దన్ 40 ఏళ్లుగా భీమవరంలో నివాసం.. అయినా ఓటు హక్కు లేదు! గతంలో ఓటు వేసిన వ్యక్తికి ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు గల్లంతు యాపిల్ ఉద్యోగుల ఏఐ ఖర్చులపై కోత: రోజువారీ బడ్జెట్‌లో భారీ తగ్గింపు గుడి నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదు! ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి 60% గ్రాంట్ ఇవ్వాలిః కేంద్ర మంత్రికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో ఇక డిజిటల్ పారదర్శకత!అదనపు కలెక్టర్ నగేష్ ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ బాబ్జి అంత్యక్రియలు. భూముల రీ-సర్వేలో అవినీతికి తావుండకూడదు!అదనపు కలెక్టర్ నగేష్ 'ఖేతీ బచావో అభియాన్'తో రైతులకు అవగాహన.. మహిళా సంఘాలు వ్యాపార కేంద్రాలుగా ఎదగాలి. డీఆర్డీఓ ఉమాహారతి చోటా షకీల్ బావమరిది ఆస్తులను జప్తు చేసిన ఈడీ ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మనోప్రియ.. చిన్నారి వైద్య ఖర్చుల కోసం రూ.13,330 ఆర్థికసాయం..

తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం: ఎర్లీ మార్నింగ్ షోలకు గ్రీన్ సిగ్నల్

Select Suryaa Now
తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం: ఎర్లీ మార్నింగ్ షోలకు గ్రీన్ సిగ్నల్
చెన్నై:తమిళనాడులోని సినిమా థియేటర్ల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గత మూడేళ్లుగా నిలిపివేసిన తెల్లవారుజామున 6 గంటల ప్రత్యేక (ఎర్లీ మార్నింగ్) ప్రదర్శనలకు మళ్లీ అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, సామాన్య ప్రేక్షకులకు ఊరటనిస్తూ థియేటర్ల యజమానులు కోరిన టికెట్ ధరల పెంపు ప్రతిపాదనను మాత్రం సర్కార్ తిరస్కరించింది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం, కొత్త సినిమాలు విడుదలైన మొదటి వారం రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి దాటాక 2:30 గంటల వరకు ప్రదర్శనలకు వెసులుబాటు కల్పించారు. అలాగే వారాంతాలు (వీకెండ్స్), పండుగ సెలవు దినాల్లో థియేటర్లలో రోజుకు గరిష్టంగా ఆరు షోల వరకు ప్రదర్శించుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రముఖ తమిళ నటుడు సూర్య నటించిన తాజా చిత్రం విడుదల నుంచే ఈ కొత్త నియమావళి తక్షణమే అమలులోకి రానుంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సూర్య అభిమానులు, తమిళ చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తుండగా, టికెట్ ధరలు పెరగకపోవడంతో సగటు ప్రేక్షకులు తీవ్ర సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.