పంటలను పరిశీలించిన సీపీఐ(ఎం)నేతలు
*--నవాబుపేటను కరువు మండలంగా ప్రకటించాలి..పంట నష్టపరిహారం చెల్లించాలి*
నవాబుపేట సూర్య న్యూస్: మండల పరిధిలోని గురుకుంట,పోమాల గ్రామాల్లో ఎండిపోయిన పంటలను సీపీఐ(ఎం)పార్టీ జిల్లా కార్యదర్శి రాములు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పరిశీలించారు.ఈ సందర్భంగా పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులు వెంకటేష్,వీరన్న,చిట్టెమ్మ,పవన్ గౌడ్,వెంకటయ్య,నర్సింహులును కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.పంటలు ఎండిపోయి ఆర్థికంగా నష్టపోయిన రైతులకు మనోధైర్యం కల్పించారు.ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ..నవాబుపేట మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు.ఎండిపోయిన పంటలతో నష్టపోయిన రైతులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ సభ్యులు కిల్లె గోపాల్,లక్ష్మయ్య,ఎస్ఎఫ్ఐ మండల ఇన్‌చార్జి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.