పశువుల కొట్టంలో పాఠాలు.. విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి?
సూర్య, బెజ్జుర్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని పాత సోమిని ట్రైబల్ వెల్ఫేర్ ప్రాథమిక పాఠశాలలో భవనం లేకపోవడంతో పశువుల కొట్టంలోనే విద్యాబోధన కొనసాగుతోంది. భవనం మంజూరు చేస్తామని అధికారులు హామీ ఇస్తున్నా ఇప్పటివరకు ఆచరణలోకి రాకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడు సైతం సక్రమంగా విధులు నిర్వహించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పాఠశాల భవనం మంజూరు చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని పాత సోమిని వార్డు సభ్యుడు తొర్రెం సురేష్ మీడియా ద్వారా కోరారు.