BREAKING
మేయర్ రూప్ కుమార్ యాదవ్‌కు శుభాకాంక్షలు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత సహాయం పొందండి-టేకుమట్ల పారా లీగల్ వాలంటీర్ అంబాల రమేష్ మంత్రాలయంలో రాఘవ సరోవర ప్రాజెక్టుకు భూమిపూజ పెద్ద సిద్దపూర్ జీపీ లో పూర్తయినా ప్రారంభానికి నోచుకోని జీపీ భవనం..... ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు కులం పేరుతో దూషణలు, దాడులు, కుటుంబానికి ప్రాణహాని ఉందని కలెక్టర్ కు ఫిర్యాదు. గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షిష ఎన్నికల్లో అల్లర్లు సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు తప్పవ్:డీఎస్పీ ....390 మంది సిబ్బందితో పటిష్ట చర్యలు..… ఇద్దరికీ డాక్టరేట్లు ప్రధానం సెంట్రల్‌లో 29 స్థానాలకు 28 చోట్ల కూటమి విజయం: బొండా ఉమామహేశ్వరరావు జ్యోతికి డాక్టరేట్ అర్హులైన పట్టభద్రులు వెంటనే ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: కాంగ్రెస్ మండల కార్యదర్శి సంకు శంకర్ తెలుగుదేశం పార్టీలో చేరిన రామచంద్రప్పకు ఘన సన్మానం. నాగాయలంకలో ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించిన కలెక్టర్ డీకే బాలాజీ వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్

ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ఉధృతి

Select Suryaa Now
 ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ఉధృతి
విజయవాడ:ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ఉధృతి తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా నీటిపారుదల శాఖ అధికారులు బ్యారేజీ గేట్లను ఎత్తి నీటిని దిగువ సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అధికారులు మొత్తం 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఇందుకోసం బ్యారేజీకి చెందిన 30 గేట్లను రెండు అడుగుల మేర, మిగిలిన 40 గేట్లను ఒక అడుగు మేర పైకి ఎత్తి ప్రవాహాన్ని దిగువకు పంపుతున్నారు.

వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు లంక గ్రామాల ప్రజలను విపత్తు నిర్వహణ యంత్రాంగం అప్రమత్తం చేసింది. నదీ తీర ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ నదిలోకి దిగవద్దని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.