సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి విరాళాల వెల్లువ
సూర్య- బిక్కనూర్ : మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి భక్తులు పెద్ద ఎత్తున విరాళాలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు భూపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు ఒక లక్ష ఒక వెయ్యి 16 రూపాయల విరాళాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డికి అందజేశారు. అలాగే దోమకొండ మండల కేంద్రానికి చెందిన పన్యాల రేణుక ముత్యం రెడ్డి దంపతులు 25 వేల విరాళాన్ని టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డికి అందజేశారు.ఈ సందర్భంగా విరాళా దాతలను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.