BREAKING
జడ్పిటిసి అభ్యర్థి లక్ష్మీ తాయారును అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. కొండయ్య సచివాలయ ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌కు ఇక గ్రీన్ వాటర్‌! జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జిల్లాలో ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ జగన్ రెడ్డి తీరువల్లే పులివెందులలో శాంతిభద్రతల సమస్య. టిడిపి యువ నాయకులు డాక్టర్ లలిత్ సాగర్. జంగంపల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి సతీమణి కావ్య రెడ్డి బాధిత కుటుంబానికి కాలనీవాసుల ఆర్థిక సహాయం రెంజల్ లో ఊర పండుగ ఘనంగా బోనాల పండుగ.. ప్రభుత్వం పిఆర్సి ని వెంటనే ప్రకటించి డీఏలను మంజూరు చేయాలని డిమాండ్..... మాదాపూర్ డివిజన్‌లో రూ.9.14 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన రాంనగర్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా మన ఎల్లారెడ్డి వాసి చలో ఆదిలాబాద్ బి ఆర్ ఎస్ గర్జన సభ. ప్రశాంత్ నగర్ కాలనీ వాసులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అమిత్ షా ‘మహా పాదయాత్ర’ను విజయవంతం చేయాలి: రవికుమార్ యాదవ్ ఈ నెల 6న శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో విద్యత్ గోష్టి

సర్దార్ పటేల్ ఆశయాలే దేశ ఐక్యతకు స్ఫూర్తి

Select Suryaa Now
సర్దార్ పటేల్ ఆశయాలే దేశ ఐక్యతకు స్ఫూర్తి

జాతీయ సమగ్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత: కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

(రంగారెడ్డి - మేజర్ న్యూస్) ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. భారత ఉక్కుమనిషి, స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని జాతీయ సమైక్యతను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి, జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని 500కు పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. దేశాన్ని ఐక్యంగా, బలంగా తీర్చిదిద్దడంలో ఆయన చూపిన నాయకత్వం, దూరదృష్టి, దేశభక్తి చిరస్మరణీయమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన సేవలు, దేశ సమగ్రత కోసం చేపట్టిన చర్యలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను పరిరక్షించడంతో పాటు ప్రజల మధ్య సోదరభావం, సామరస్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తూ దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని తెలిపారు.

అనంతరం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులతో పాటు ఉద్యోగులు, సిబ్బందిచే జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు అంకితభావంతో పనిచేస్తామని, ప్రజల మధ్య సోదరభావం, సామరస్యం, ఐక్యతను పెంపొందించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.