BREAKING
పెరవలి మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార జోరు ఆర్నాబ్ తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం - ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కాకరపర్రులో మీ మార్ట్‌ను ప్రారంభించిన తహసీల్దార్ కే. నిరంజన్ మోహన్‌లాల్ 'అతిమనోహరం' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఎంజీ శ్రీకుమార్ కాంబో మళ్లీ రిపీట్ పుర పోరులో ఎన్డీఏ కూటమిదే విజయం పోగొట్టుకున్న మొబైల్ అందజేత గుజరాత్ ఐక్యత దినోత్సవ వేడుకల్లో నల్లగొండ సర్పంచులు అన్నవరప్పాడు వెంకన్న ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు చికిత్స పొందుతూ మహిళ మృతి. ఆదర్శ కుటుంబం టీమ్‌పై జిమ్ జిమ్ తార సింగర్ లక్ష్మి తీవ్ర ఆగ్రహం కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కంబాల విస్తృత ఎన్నికల ప్రచారం ముమ్మిడివరం మున్సిపాలిటీలో 23 వార్డులకు పోలింగ్ పూర్తి.... అత్యధికంగా 759, అత్యల్పంగా 560 ఓట్లు నమోదు.. నగర పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం సీఐ మోహన్ కుమార్....

జిల్లాలో ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్

Select Suryaa Now
జిల్లాలో ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు  జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్

అనకాపల్లి ప్రతినిధి,  నవంబర్ 1, మేజర్ న్యూస్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ పత్రికా ముఖంగా తెలియజేశారు.
జిల్లాలో మున్సిపల్ మరియు ఎలమంచిలి నర్సీపట్నం మున్సిపాలిటీలలో ఎన్నికలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో  జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా తో కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా నిర్వహించబడిన తీరును వివరించారు. పోలింగ్ నిర్వహణకు చేసిన ఏర్పాట్లు, ఎన్నికల సందర్భంగా చేపట్టిన భద్రతా చర్యలు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ మరియు ఎన్నికల యంత్రాంగం సమన్వయంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించినందుకు అభినందించారు. జిల్లాలో ఎక్కడ రీపోలింగ్ అవకాశం లేదని, జిల్లా వ్యాప్తంగా అధికారులు ధృవీకరించిన నివేదికల ప్రకారం జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.అదేవిధంగా, ఎన్నికల నిర్వహణకు సహకరించిన ఓటర్లు, పోలింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు మరియు ఇతర భాగస్వాములందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.