BREAKING
పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ కార్తీక పౌర్ణమి వేడుకలతో వాడరేవు సముద్రతీరం కిటకిట గంభీరవుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ అందించడమే లక్ష్యం త్రివేణి సంగమ గోదావరికి మహా పూజ కార్యక్రమం పణితి డానియేలు ఆదరణ కూడికలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన ముక్కన్న ద్విచక్ర వాహనం ఢీకొని మృతి... జగ్గయ్యపేట పట్టణంలో నూతన విద్యుత్ పోల్స్, లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య),మున్సిపల్ చైర్మన్ శ్రీమతి నరేంద్రుల వినీత కార్తీక పౌర్ణమి వేడుకలకు భక్తుల పోటెత్తిన రద్దీ *చింతపల్లి ఉమామహేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం* *3 వేల మందికి పైగా భక్తుల దర్శనం..* హైదరాబాద్ వీధుల్లో విజయ్ ఆంటోనీ సందడి.. అమీర్‌పేటలో మిర్చి బజ్జీలు వేసి ఇరానీ చాయ్ తాగిన స్టార్ హీరో నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నెటిజన్ కామెంట్‌పై డింపుల్ హయతి ఫన్నీ రిప్లై పెద్ది పాట వివాదంపై శ్రుతి హాసన్ స్పష్టత.. జాన్వీ కపూర్ వ్యాఖ్యలపై ఆసక్తికర కామెంట్స్ కళ్యాణదుర్గం రూరల్ మండలంలో సెక్షన్ 163 అములు... 28వ వార్డు కౌన్సిలర్‌గా పచ్చిపాల రామకృష్ణ ఆచారి ప్రమాణం : అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే జహా,చైర్మన్ శ్రీరామ్ చినబాబు : శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు,వార్డు ప్రజలు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా..?మాజీ మంత్రి శైలజానాథ్‌ను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

ఆదిలాబాద్, మామ్నూర్ విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

Select Suryaa Now
ఆదిలాబాద్, మామ్నూర్ విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

తెలంగాణలో విమానానాయ రంగం విస్తరణ వేగవంతమవుతోంది. రాష్ట్రంలోని ప్రాంతీయ అనుసంధానతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన ఆదిలాబాద్ మరియు వరంగల్ మామ్నూర్ విమానాశ్రయాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.  న్యూఢిల్లీలో పర్యటించిన సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. మామ్నూర్ విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్ నాటికి శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో సేవలు, ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్) సౌకర్యాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రన్‌వే స్పెక్సిఫికేషన్లపై రక్షణ మరియు పౌర విమానయాన శాఖల మధ్య సంయుక్త సమావేశం నిర్వహించాలని కోరడంతో ఈ ప్రాజెక్టులపై వేగం పెరిగింది. త్వరలోనే రాష్ట్రంలో విమానాశ్రయాల నిర్మాణం ఊపందుకునే అవకాశం ఉంది.